Abid Bhushan: మిస్టీరియస్ కథతో
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:47 AM
పాతతరం నటుడు నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో ఉషా, శివాని నిర్మించారు...
పాతతరం నటుడు నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో ఉషా, శివాని నిర్మించారు. రోహిత్ సహాని కీలకపాత్ర పోషిస్తున్నారు. రియాకపూర్, మేఘనా రాజ్‌పుత్ కథానాయికలు. ఇటీవలె నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘సస్పెన్స్ జానర్‌లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా స్ర్కీన్‌ప్లేలో చాలా మార్పులు చేశాం’ అన్నారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూ్‌సతో గ్రాండియర్‌గా నిర్మించిన చిత్రమిది, భవిష్యత్‌లో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తామని నిర్మాతలు తెలిపారు.