సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vasudevasutam: ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ సాంగ్

ABN, Publish Date - Nov 02 , 2025 | 01:09 PM

మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి కీలక పాత్రల్లో ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా వైకుంఠ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే

మాస్టర్ మహేంద్రన్(Master Mahendran), అంబికావాణి  Ambika vani) కీలక పాత్రల్లో ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా వైకుంఠ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’ (Vasudevasutam). రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా  టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘వసుదేవసుతం దేవం’ అంటూ సాగే ఈ  పాటను ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించారు. చైతన్య ప్రసాద్ అందించిన సాహిత్యం, పవన్-శృతిక సముద్రాల గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు.  ఊరి వాతావరణం, గుడిలో చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకుల్ని అలరించేలా ఉంది. 

ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ 'ఈ మూవీలోని ‘వసుదేవసుతం దేవం’ పాట చాలా బాగుంది. చైతన్య ప్రసాద్ గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం బాగుంది. మహేంద్రన్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.  

 

Updated Date - Nov 02 , 2025 | 06:03 PM