Jatadhara First Look: విజువల్ వండర్‌గా జటాధర
ABN, Publish Date - Aug 06 , 2025 | 02:28 AM
సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషిస్తున్న మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్
సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషిస్తున్న మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుధీర్‌బాబు, సోనాక్షి గెటప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాదిలోనే విడుదలయ్యే ‘జటాధర’ చిత్రాన్ని ఉమేశ్‌కుమార్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ఫ్రెర్నా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు.