Prabhas: లవ్ కి స్పెల్లింగ్ కూడా తెలియకపోతే.. పెళ్లి ఎలా అవుతుంది డార్లింగ్
ABN, Publish Date - Dec 06 , 2025 | 04:44 PM
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే అస్సలు తడుముకోకుండా ప్రభాస్ (Prabhas) అని చెప్పేస్తారు.
Prabhas: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే అస్సలు తడుముకోకుండా ప్రభాస్ (Prabhas) అని చెప్పేస్తారు. డార్లింగ్ కన్నా చిన్నవారు కూడా పెళ్లి పీటలు ఎక్కి తల్లిదండ్రులు కూడా అవుతున్నారు. కానీ, ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి డేట్ చెప్తా.. కచ్చితంగా చేసుకుంటా అంటూ చెప్పడమే కానీ, ఆ ముచ్చటే లేకుండా పోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ గత రెండు రోజులుగా జపాన్ లో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. బాహుబలి ది ఎపిక్ సినిమా జపాన్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా అక్కడ అభిమానులను కలిసి వారితో బాహుబలి అనుభవాలను పంచుకున్నాడు.
ఇక జపాన్ లోని ఫ్యాన్స్.. ప్రభాస్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. డార్లింగ్ కూడా ఎంతో ఓపిగ్గా వారికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. ఒక ఫ్యాన్ కి ఆటోగ్రాఫ్ ఇస్తూ డార్లింగ్ లవ్ స్పెల్లింగ్ రాయడంలో తడబడ్డాడు. LOVE రాయబోయి.. LOE అని రాసి.. మళ్లీ వెంటనే కరెక్ట్ స్పెల్లింగ్ రాసి ప్రభాస్ అని సైన్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. లవ్ స్పెల్లింగ్ రాయడంలో తడబడ్డ డార్లింగ్ ను అభిమానులు సరదాగా ఆటపట్టిస్తున్నారు. డార్లింగ్.. నిజంగానే మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 సినిమాలో బ్రహ్మానందం.. ఆర్య, ఐ లవ్ యూ అని రాయమ్మ అంటే స్పెల్లింగ్ ఏంటి సార్ అని అడుగుతాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా లవ్ స్పెల్లింగ్ కూడా తెలియకపోవడంతో ఇంత అమాయకుడు ఏంట్రా.. మన ప్రభాస్ అన్నా.. అసలు లవ్ కి స్పెల్లింగ్ కూడా తెలియదు.. ఇలా అయితే పెళ్లి ఎలా అవుతుంది.. ? అందుకే డార్లింగ్ ప్రేమకు, పెళ్ళికి దూరంగా ఉన్నాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.