Bakassuru Restaurant: అలరించే కామెడీ థ్రిల్లర్
ABN, Publish Date - Aug 04 , 2025 | 06:01 AM
ప్రవీణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్ జే శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటించారు...
ప్రవీణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్ జే శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటించారు. లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రవీణ్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నందుకు సంతోషంగా ఉంది. ‘బకాసురు రెస్టారెంట్’ ఘన విజయం అందుకోవాలి’ అని ఆకాంక్షించారు. ప్రవీణ్ మాట్లాడుతూ ‘నా మీద నమ్మకంతో హీరోగా పెట్టి సినిమా తీసిన మా దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రం ఇది’ అని చెప్పారు. దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఆధ్యంతం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది’ అని అన్నారు.