71st National Film Awards: ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి
ABN, Publish Date - Aug 01 , 2025 | 06:33 PM
కేంద్ర ప్రభుత్వం 71 వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి (Bhagavanth Kesari) జాతీయ అవార్డును అందుకుంది.
71st National Film Awards: కేంద్ర ప్రభుత్వం 71 వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి (Bhagavanth Kesari) జాతీయ అవార్డును అందుకుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో నటించగా.. కాజల్ హీరోయిన్ గా నటించింది. 2023 లో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకుంది. నేలకొండ భగవంత్ కేసరిగా బాలయ్య నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అనే పాయింట్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒక గుణపాఠం గా చూపించింది. ఇక ఈ విషయం తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ సంబురాలు మొదలుపెట్టారు. ఈ ఏడాదిలోనే బాలయ్యకు పద్మభూషణ్ వరించింది. ఆ ఆనందంలో ఉన్నప్పుడే మరో జాతీయ అవార్డును ఆయన సినిమాకు రావడం హర్షించదగ్గ విషయమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.