సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhanda2: అఖండ2.. టికెట్ రూ.600! ఏపీలో.. రేట్లు పెంపు!

ABN, Publish Date - Dec 02 , 2025 | 07:23 PM

బాల‌కృష్ణ, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం అఖండ‌2 పై దేశ వ్యాప్తంగా అంత‌కంత‌కు అంచ‌నాలు పెరుగుతూనే ఉన్నాయి.

Akhanda2

బాల‌కృష్ణ (Nandamuri Balakrishna), బోయ‌పాటి (Boyapati Srinu) కాంబినేష‌న్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం అఖండ‌2 (Akhanada2) పై దేశ వ్యాప్తంగా అంత‌కంత‌కు అంచ‌నాలు పెరుగుతూనే ఉన్నాయి. మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌కు సినిమా రానున్న నేప‌థ్యంలో అంత‌టా అఖండ పేరే వినిపిస్తోంది. భారీ హైప్స్ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్రీమియ‌ర్స్ కూడా ఫ్లాన్ చేయ‌గా ఫ్యాన్స్ ఇప్ప‌టికే టికెట్ల కోసం ఎగ‌బ‌డుతున్నారు.

అయితే.. తాజాగా మూవీ టికెట్ రేట్ల విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వం ప్ర‌త్యేక జీవో విడుద‌ల చేసింది. సినిమా రిలీజ్‌కు ఓ రోజు ముందు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ప్రీమియ‌ర్ షోల‌కు జీఎస్టీతో క‌లిపి టికెట్ ధ‌ర రూ. 600గా నిర్ణ‌యించారు. ఇక డిసెంబ‌ర్ 5 నుంచి ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ల‌లో (Single Screens) రూ.75, మ‌ల్టీఫ్లెక్స్ ల (Multiplexes) లో రూ.100 అద‌నంగా ధ‌ర‌లు పెంచుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌త్యేక జీవో విడుద‌ల చేసింది. ఇదిలాఉంటే.. తెలంగాణ‌లో సినిమా టికెట్ రేట్ల విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స్పంద‌న లేదు.

Updated Date - Dec 02 , 2025 | 07:26 PM