Sai Kumar in Cinema: నటుడిగా 50 ఏళ్లు

ABN , Publish Date - Jul 27 , 2025 | 02:45 AM

హీరోగా, విలన్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విలక్షణ నటుడు సాయి కుమార్‌. ఆయన పేరు వింటే ఎన్నో అద్భుతమైన డైలాగులు కళ్ల ముందు మెదులుతాయి. నేడు...

హీరోగా, విలన్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విలక్షణ నటుడు సాయి కుమార్‌. ఆయన పేరు వింటే ఎన్నో అద్భుతమైన డైలాగులు కళ్ల ముందు మెదులుతాయి. నేడు(జూలై 27) ఆయన 65వ పుట్టిన రోజు. అంతేకాదు ఈ ఏడాదితో సాయి కుమార్‌ నట జీవితానికి 50 ఏళ్లు నిండాయి. ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎన్నో గొప్ప చిత్రాలతో మెప్పించిన సాయి కుమార్‌ 1975 జనవరి 9న ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో నటుడిగా ఆరంగేట్రం చేశారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఆయన నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘కోర్ట్‌’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కొత్తతరం ఆర్టిస్టులు వస్తున్నా, గట్టి పోటీ ఉన్నా సాయి కుమార్‌ ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ.. ప్రతీ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సాయిధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటిగట్టు’, నాగ శౌర్య ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తిక్‌’, కిరణ్‌ అబ్బవరం ‘కే ర్యాంప్‌’, అల్లరి నరేశ్‌ ‘12ఏ రైల్వే కాలనీ’, ‘ధర్మస్థల నియోజకవర్గం’, ‘రాజాధి రాజా’, కోన వెంకట్‌తో ఓ సినిమా, ఎస్వీ కృష్ణారెడ్డితో మరో చిత్రం ఇలా..ఫుల్‌ బిజీగా ఉన్నారు. కన్నడ, తమిళ చిత్రాలలోనూ నటిస్తున్నారు.

Sunday Tv Movies: ఆదివారం, జూలై 27న.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Deviyani Sharma: అందాలను ఈ రేంజ్ లో ఆరబోస్తున్నా పట్టించుకోరేంటయ్యా

Updated Date - Jul 27 , 2025 | 02:45 AM