ఆగిపోను నేను
ABN, Publish Date - Jun 25 , 2025 | 05:22 AM
సిద్ధార్థ్ కథానాయకుడిగా శ్రీగణేశ్ తెరకెక్కిస్తున్న చిత్రం 3 బీహెచ్‌కే. శరత్‌కుమార్, యోగిబాబు, దేవయాని కీలక పాత్రలు పోషిస్తున్నారు...
సిద్ధార్థ్ కథానాయకుడిగా శ్రీగణేశ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘3 బీహెచ్‌కే’. శరత్‌కుమార్, యోగిబాబు, దేవయాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకున్నాయి. తాజాగా, సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఆగిపోను నేను’ అంటూ సాగే ఈ పాట మధ్య తరగతి జీవితాల్ని ప్రతిబింబిచేలా ఉంది. దేవా రచించి ఆలపించారు. అమృత్ రామ్‌నాథ్ స్వరపరిచారు. ఈ చిత్రానికి ఎడిటర్: గణేశ్ శివ, సినిమాటోగ్రఫీ: దినేశ్ కృష్ణన్.బి, జితిన్ స్టానిస్లాస్.