17 Years of Nani: 17 ఏళ్ల నాని
ABN, Publish Date - Sep 06 , 2025 | 06:08 AM
హీరో నాని సినీ ప్రయాణం ప్రారంభించి 17 ఏళ్లు పూర్తయిన ప్రత్యేక సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ద ప్యారడైజ్’ చిత్రం నుంచి ఓ పవర్‌ఫుల్ స్టిల్ విడుదల చేశారు మేకర్స్...
హీరో నాని సినీ ప్రయాణం ప్రారంభించి 17 ఏళ్లు పూర్తయిన ప్రత్యేక సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ద ప్యారడైజ్’ చిత్రం నుంచి ఓ పవర్‌ఫుల్ స్టిల్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో నాని కంప్లీట్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం నాని జిమ్‌లో బీభత్సంగా వర్కవుట్ చేస్తున్నారని ఈ స్టిల్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ప్యారడైజ్ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్‌లో జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 మార్చి 26న మొత్తం ఎనిమిది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.