Harish Shankar: పొలిమేరలు దాటి ధమాకా సౌండ్ ఇవ్వాలి ని కోరుకుంటున్నాను

ABN , Publish Date - Nov 18 , 2025 | 03:56 PM

'హీరోగా  64 సినిమాలు చేశాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే టెన్షన్ గా ఉంటుంది. నానికి ఎక్కడ టెన్షన్ లేదు.  ఇంత కాన్ఫిడెన్స్ గా ఉండడానికి కారణం మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంది.

అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం '12A రైల్వే కాలనీ'.  కామాక్షి భాస్కర్ల  కథానాయిక. నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. నవంబర్‌ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా  మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ 
'హీరోగా  64 సినిమాలు చేశాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే టెన్షన్ గా ఉంటుంది. నానికి ఎక్కడ టెన్షన్ లేదు.  ఇంత కాన్ఫిడెన్స్ గా ఉండడానికి కారణం మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వారిని ఎవరు ఆపలేరు. నేను 35 మంది కొత్త డైరెక్టర్స్ తో పని చేశాను.  దాంట్లో చాలా మంది సక్సెస్ అయ్యారు. ఒక డైరెక్టర్ కొడుకుగా నేను వాళ్ళ అందరితో ఎప్పుడూ ఉంటాను. ఈ సినిమాకి విజువల్స్, మ్యూజిక్, ఆర్టిస్ట్స్ అన్ని చక్కగా కుదిరాయి. నాకు ఇది చాలెంజింగ్ ఫిలిం. ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది' అన్నారు 

డైరెక్టర్ ఎడిటర్ అయితే డబల్ కా మీఠానే: హరీష్ శంకర్

'ట్రైలర్ చూడగానే డైరెక్టర్ నాని గురించి మాట్లాడాలనిపించింది. ఒక డైరెక్టర్ ఎడిటర్ అయితే సినిమా డబల్ కా మీఠా అవుతుంది. ఈ సినిమా పొలిమేరలు దాటి ధమాకా సౌండ్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈవివి గారి సినిమాలు చూసిన తర్వాత రైటర్ గా కావాలని డిసైడ్ అయ్యాను. ఒక దర్శకుడికి అవకాశం ఇస్తే ఎంతో మందికి అవకాశం ఇచ్చినట్టు. నరేష్ గారు 35 మంది దర్శకులను పరిచయం చేశారు. ఆ రకంగా చూస్తుంటే కొన్ని వందల మందికి లైఫ్ ఇచ్చారు. నరేష్ గారు ఎన్నో సినిమాలు చేశారు. ఆయన ఫస్ట్ సినిమా అల్లరి కాబట్టి అల్లరి నరేష్ అన్నారు. ఏ డైరెక్టర్ స్క్రిప్ట్ తో వెళ్లిన రెడీగా ఉంటారు. కాబట్టి ఆయన అల్లరి నరేష్ గారు ఇకపై అందరి నరేష్ అని పిలవాలని కోరుకుంటున్నాను' అన్నారు. 

 
అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ 'ఇలాంటి కొత్త కథని యాక్సెప్ట్ చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదు. నరేష్ కెరీర్ లో  'గమ్యం', 'నాంది', '12A రైల్వే కాలనీ'  టాప్ త్రీలో ఉంటాయని భావిస్తున్నాను. సినిమా అదిరిపోయింది. కామాక్షి నా ఫ్రెండ్. నా ప్రతి సినిమాలో తను ఉంటుంది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది. ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. రైటర్ గురించి డైరెక్టర్ గురించి గూగుల్ చేస్తారు. తర్వాత కథను ఎవరు ఊహించలేరు. కావలసిన ట్విస్టులు ఉన్నాయి. డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు. 

దర్శకుడు నాని మాట్లాడుతూ '
మా నాన్నగారు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాంటి పెద్ద వేదికల మీద మాట్లాడాలని ఆయన కోరిక. కానీ 2014లో ఆయన చనిపోయారు. నేను డైరెక్ట్ అవ్వడానికి 15 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఈ వేదికలో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. నాన్న ఎక్కడున్నా చూస్తారని నమ్ముతున్నాను. ఈ ఇవన్నీ సాధ్యమైంది అనిల్ వల్లే. ఆయన ఎప్పుడూ కూడా నాకు  భుజం తడుతూనే ఉన్నారు. 21న థియేటర్స్ లో చూడండి. ఒక మంచి సినిమా చూశారని ఫీల్ తో బయటికి వెళ్తారు' అన్నారు. 

Updated Date - Nov 18 , 2025 | 04:06 PM