సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: ఈ వీకెండ్ లో ఏకంగా 12 సినిమాలు...

ABN, Publish Date - Nov 11 , 2025 | 12:07 PM

ఈ వీకెండ్ లో డబ్బింగ్ తో కలిపి ఏకంగా 12కు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అలానే నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ 'శివ' రీ-రిలీజ్ కాబోతోంది.

Telugu New movies

రాశి కాదు వాసి ప్రధానం అని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇవాళ వస్తున్న సినిమాలకు ఇది వర్తించదేమో అనిపిస్తోంది. చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోతుండటంతో ఎంతో కాలంగా విడుదలకు నోచుకోకుండా ఉండిపోయిన సినిమాలన్నీ ఇప్పుడు కట్టకట్టుకుని జనం ముందుకు వచ్చేస్తున్నాయి. లాస్ట్ వీకెండ్ లో అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా 10 సినిమాలు విడుదల కాగా ఇప్పుడు అది 12కి చేరింది. నవంబర్ 14న రాబోతున్న సినిమాలు ఇప్పటికైతే 14 వరకూ ఉన్నాయి. అందులో ఒకటి రెండు సినిమాలు చివరి నిమిషంలో విడుదల కాకపోయినా... 12 సినిమాలు అయితే థియేటర్లలోకి వస్తాయి.


ఈ వీకెండ్ లో విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana Prapthirasthu) మూవీ విడుదల కాబోతోంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కొత్తగా పెళ్ళైన దంపతులు ఎదుర్కొంటున్న సంతానలేమి సమస్య మీద తెరకెక్కింది. ఇక ఈ వీకెండ్ తో చెప్పుకోదగ్గ మరో సినిమా దుల్కర్ సల్మాన్ నటించిన 'కాంత' (Kantha). ఈ పాన్ ఇండియా మూవీలో రానా దగ్గుబాటి, సముతిర కని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ పిరియాడిక్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఇదే వారాంతంలో గోవా ట్రిప్ మీద తెరకెక్కిన 'జిగ్రిస్, గోపి గాళ్ల గోవా ట్రిప్' మూవీస్ వస్తున్నాయి. వీటితో పాటు 'సి మంతం', 'సీత ప్రయాణం కృష్ణతో', 'రోలుగుంట సూరి', 'స్కూల్ లైఫ్‌', మా ఊరి వెంకన్న, ఆట కదరా శివ' సినిమాలు విడుదల అవుతున్నాయి. గతవారం రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో రాగా ఈ వీకెండ్ లో రెండు కన్నడ అనువాద చిత్రాలు వస్తున్నాయి. అందులో ఒకటి 'లవ్ ఓటీపీ' (Love OTP) కాగా మరొకటి 'గత వైభవం'.


ఈ సినిమాల ముచ్చట ఇలా ఉంటే... నాగార్జున (Nagarjuna) హీరోగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన 'శివ' (Siva) సినిమాను నవంబర్ 14న భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయబోతున్నారు. గత వారం విడుదలైన పది చిత్రాలలో ఏదీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. వాటిల్లో రశ్మిక మందణ్ణ కారణంగా 'ది గర్ల్ ఫ్రెండ్', స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉండటంతో తిరువీర్ నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రాలు మాత్రమే ఓ మేరకు ఫర్వాలేదనిపించాయి. మరి ఈలోగా మరో పన్నెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే వారిని ఉక్కిరి బిక్కిరి చేయడమే అవుతుంది. మరి వీటిలో ఏ యే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారో చూద్దాం. చిత్రం ఏమంటే... వచ్చే శుక్ర, శని వారాల్లోనూ పది సినిమాల వరకూ విడుదల కాబోతున్నాయి.

Also Read: KH 237: ‘కమల్‌ 237’లో మాలీవుడ్‌ టెక్నీషియన్లకు ప్రాధాన్యం

Also Read: Ram Gopal Varma: ‘శివ’ సీక్వెల్‌ తీస్తే ఎవరితో.. వర్మ ఏమన్నారంటే...

Updated Date - Nov 11 , 2025 | 12:12 PM