Sreelaala: చెన్నైలో.. శ్రీలీల హంగామా! ఎగబడ్డ జనం
ABN, Publish Date - Dec 03 , 2025 | 08:06 AM
ప్రముఖ సినీ నటి శ్రీలీల (Sreeleela) వేళచ్చేరిలోని ఫీనిక్స్ మార్కెట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సందడి చేశారు.
ప్రముఖ సినీ నటి శ్రీలీల (Sreeleela) వేళచ్చేరిలోని ఫీనిక్స్ మార్కెట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సందడి చేశారు. నిత్యం వెండితెరపై చూసే తమ అభిమాన నటి కళ్ల ముందు తళుక్కుమనడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
ఒకవైపు విద్యుద్దీపాల ప్రకాశం, మరోవైపు డీజే సుకేతు సంగీ తంతో కలిసి అభిమానుల సందడి మాల్ను హోరెత్తించింది. ప్రాంగణ మంతా నృత్యవేదికగా మారిపోయింది.
సందర్శకులు ఆటలు, పాట లతో శ్రీలీలను మెప్పించేందుకు పోటీపడ్డారు. అంతేగాక ఆమెతో సెల్ఫీలు దిగేందుకు బారులు తీరారు.
ఇందుకు సంబంధఙంచిన ఫఞటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే.. శ్రీలీల నటించిన తొలి తమిళ చిత్రం పరాశక్తి సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.