Abishan Jeevinth: దర్శకుడి పెళ్లి.. బహుమతిగా లగ్జరీ BMW కారు
ABN, Publish Date - Oct 30 , 2025 | 04:37 PM
తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న యువ దర్శకుడు అభిషన్ జీవింత్ కు నిర్మాత లగ్జరీ కారును బహుకరించారు.
తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న యువ దర్శకుడు అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) కు నిర్మాత మహేష్ రాజ్ (mageshraj) ఒక లగ్జరీ కారును బహుకరించారు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family) నిర్మాతల్లో ఒకరైన మహేష్ రాజ్ ఈ కారును అభిషన్‌కు పెళ్ళి బహుమతిగా అందజేశారు.
అభిషన్ జీవింత్ వివాహం ఈ నెల 31వ తేదీన ప్రియురాలితో జరుగనుంది. ఈ మ్యారేజ్ గిఫ్టుగా నిర్మాత మహేష్ రాజ్ బీఎండబ్ల్యూ కారు అందజేశారు. కాగా, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో దర్శకుడిగా పరిచయమైన అభిషన్.. ఇపుడు హీరోగా ఓ చిత్రంలో నటించారు. మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ (Anaswara Rajan) కథానాయికగా నటించింది. కరెక్టెడ్ మచి (Corrected Machi) అనేది సినిమా టైటిల్.
ఇదిలాఉంటే.. ఈ చిత్రం అతి తక్కువ కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను జరుపుకుంటుంది. త్వరలో థియేటర్లకు వచ్చేందుకు కూడా సిద్దమైంది. ఇంకా చిత్రం ఎంటంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అప్పుడు తప్పితే ఇప్పటి వరకు ఓ చిన్న అప్డేట్, ఫస్ట్ లుక్స్ రానప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌తో ఓటీటీ డీల్ కూడా పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.