Vishnu Vishal: ఆ సినిమాని మించి ఈ సినిమా ఉండదు.. నిజాయితీగా ఒప్పుకున్న హీరో
ABN , Publish Date - Oct 25 , 2025 | 09:57 PM
కోలీవుడ్ కుర్ర హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal), శ్రద్ద శ్రీనాధ్ (shraddha srinath) జంటగా ప్రవీణ్ కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్యన్ (Aaryan).
Vishnu Vishal: కోలీవుడ్ కుర్ర హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal), శ్రద్ద శ్రీనాధ్ (shraddha srinath) జంటగా ప్రవీణ్ కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్యన్ (Aaryan). దర్శకుడు, నటుడు, ధనుష్ అన్న అయిన సెల్వ రాఘవన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలుగులో కూడా ఆర్యన్ ట్రైలర్ ప్రేక్షకులను అలరించింది. అక్టోబర్ 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విష్ణు విశాల్.. వరుసగా ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను ఇంకా పెంచుతున్నాడు.
తాజాగా విష్ణు విశాల్.. ఆర్యన్ ప్రెస్ మీట్ కి నాట్ రాచసన్ (రాచసన్ కాదు) అని రాసి ఉన్న టీ షర్ట్ తో రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విష్ణు విశాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా రాచసన్ నిలిచింది. ఇప్పటికీ థ్రిల్లర్ మూవీస్ లో ఈ సినిమా టాప్ 5 లో ఒకటిగా ఉంటుంది. ఇక ఆర్యన్ ట్రైలర్ చూసాకా అభిమానులు సైతం ఆ సినిమానే గుర్తుకు తెచ్చుకున్నారు.
తాజాగా ప్రెస్ మీట్ లో కూడా విష్ణు విశాల్ కి ఇదే ప్రశ్న ఎదురయ్యింది. రాచసన్ లానే ఆర్యన్ కూడా ఉంటుందా.. ? సేమ్ థ్రిల్లర్ జానర్ నా అన్న ప్రశ్నకు కుర్ర హీరో ఎంతో నిజాయితీగా ఆన్సర్ ఇచ్చాడు. ఆ సినిమాని మించి ఈ సినిమా ఉండదు.. ఆస్థాయి సినిమా ఆర్యన్ కాదు. అది ఇండియా థ్రిల్లర్ మూవీస్ లో ఒక రిఫరెన్స్ గా మారింది. అలాంటి సినిమా ఇది అని నేను చెప్పను. కాకపోతే చాలా డిఫరెంట్ గా ఆర్యన్ కథను తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చాడు. అందరి హీరోల్లా అంతకు మించి ఉంటుంది.. అసలు అది గుర్తుండదు ఈ సినిమా సూపర్ గా వచ్చింది అనకుండా నిజాయితీగా ఉన్న వాస్తవాన్ని ఒప్పుకొని మాట్లాడిన హీరోను ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. మరి ఈ సినిమాతో విష్ణు విశాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Mass Jathara: మాస్ జాతర.. ఒకరోజు వెనక్కి
Tollywood: భర్తలు దర్శకులు.. భార్యలు నిర్మాతలు.. అదిరిపోయిన కాంబో