సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishnu Vishal: 34 నెలల తర్వాత సోలో లీడ్ గా...

ABN, Publish Date - Sep 30 , 2025 | 08:11 PM

'రాక్షసన్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసి మెప్పించిన విష్ణు విశాల్ మరోసారి తన తాజా చిత్రం 'ఆర్యన్' కోసం ఖాకీ దుస్తులు ధరించాడు.

Vishnu Vishal

'రాక్షసన్' విజయం తర్వాత, విష్ణు విశాల్ (Vishnu Vishal) మరోసారి 'ఆర్యన్' (Aaryan) లో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సెల్వ రాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath), మానస చౌదరి (Maanasa Chowdhary) కీలక పాత్రల్లో నటించగా, సాయి రోనక్ (Sai Ronak), తారక్ పొన్నప్ప, మాల పార్వతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఒక యూనిక్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ నటించిన 'ఎఫ్‌.ఐ.ఆర్.' చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయిత.


అక్టోబర్ 31న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో జనం ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రెండు భాషల్లోనూ విడుదల చేశారు. ఈ డార్క్ అండ్ సస్పెన్స్ ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను శుభ్ర, ఆర్యన్ రమేశ్‌ తో కలిసి విష్ణు విశాల్ నిర్మించారు. ఒక థ్రిల్లింగ్ హత్య దర్యాప్తు, విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ఈ టీజర్ సాగింది. తనదైన శైలిలో విభిన్నమైన పాత్రతో విష్ణు విశాల్ ఆకట్టుకున్నారు. 34 నెలల విరామం తర్వాత, విష్ణు విశాల్ ఈ టీజర్ తో సోలో లీడ్ గా కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు.

Updated Date - Sep 30 , 2025 | 08:16 PM