Vishnu Vishal Aaryan: ర‌వితేజ‌పై ప్రేమ‌. సినిమా వాయిదా వేసుకున్న త‌మిళ హీరో

ABN , Publish Date - Oct 29 , 2025 | 07:45 AM

విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆర్యన్‌’ (Aaryan) తెలుగులో విడుదల కొత్త తేదీకి మారింది.

Vishnu Vishal

విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆర్యన్‌’ (Aaryan) తెలుగులో విడుదల కొత్త తేదీకి మారింది. ముందు ప్రకటించిన విధంగా ఈ నెల 31న ఈ చిత్రం విడుదలవ్వడం లేదు. ఒక వారం ఆలస్యంగా నవంబర్‌ 7న ‘ఆర్యన్‌’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు విష్ణు విశాల్ (vishnu vishal) తెలిపారు. ‘రవితేజ (Ravi Teja) నటించిన ‘మాస్‌ జాతర’, ‘బాహుబలి: ది ఎపిక్‌’ చిత్రాలు కూడా ఈ నెల 31న విడుదలవుతున్నాయి. రవితేజతో నాకున్న స్నేహం, రాజమౌళిపై గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన తెలిపారు.

Vishnu Vishal

అయితే ‘ఆర్యన్‌’ తమిళ వెర్షన్‌ మాత్రం ఈ నెల 31నే విడుదలవనుంది. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఆర్యన్‌’ చిత్రానికి ప్రవీణ్‌ కె దర్శకుడు. శుభ్ర, ఆర్యన్‌ రమేశ్‌ నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. తెలుగ‌మ్మాయి మాన‌సా చౌద‌రి (manasa choudhary) ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది.సెల్వ రాఘవన్‌ కీలకపాత్ర పోషించారు. శ్రేష్ట్‌ మూవీస్‌ అధినేత సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

Vishnu Vishal

ఇదిలాఉంటే.. విష్ణు విశాల్ న‌టించిన మ‌ట్టీ కుస్తీ సినిమాకు ర‌వితేజ స‌హా నిర్మాత కాగా ఆపై వ‌చ్చిన విష్ణు చిత్రాల‌కు సైతం మాస్ మ‌హ‌రాజా స‌పోర్ట్ అందించారు. విష్ణు విశాల్ తెలుగులో డబ్ చేసిన రెండు సినిమాలకి రవితేజ సమర్పకుడిగా వ్యవహరించాడు.

ఈ నేప‌థ్యంలో ర‌వితేజ మాస్ జాత‌ర (Mass Jathara) చిత్రానికి పోటీగా త‌న చిత్రాన్ని పోటీలో ఉంచ‌లేక‌ వాయిదా వేయ‌డం విశేషం. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ లెట‌ర్ సైతం రిలీజ్ చేసి సినిమా వాయిదా వేయ‌డంపై తెలుగు వారిని అభ్య‌ర్థించాడు. కాగా విష్ణు విశాల్ ఐదేండ్ల క్రితం మ‌న తెలుగు క్రీడాకారిణి గుత్తా జ్వాల‌ను వివాహాం చేసుకోగా వారికి ఓ పాప సంతానం.

Updated Date - Oct 29 , 2025 | 01:25 PM