Vishal: స్నేహితుడిని కలిశానంటూ విశాల్‌ ఆనందం..

ABN, Publish Date - May 18 , 2025 | 05:37 PM

విజయ్‌ సేతుపతితో (Vijay Sethupati) కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు హీరో విశాల్‌ (Vishal)

విజయ్‌ సేతుపతితో (Vijay Sethupati) కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు హీరో విశాల్‌ (Vishal). తమిళనాడులోని విల్ల్లుపురం జిల్లా కూవాగంలో కొన్ని రోజు క్రితం నిర్వహించిన అందాల పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్‌..  వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడమే అందుకు కారణమని ఆయన టీమ్‌ చెప్పినట్టు కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి. ఆ ఘటన తర్వాత విశాల్‌ తొలిసారిగా కనిపించడంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘నా స్నేహితుడు విజయ్‌ సేతుపతిన చాలాకాలం తర్వాత చెన్నై విమానాశ్రయంలో కలిశా. అతడిని ఎప్పుడు కలిసినా ఆనందమే. ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. మేం మాట్లాడుకునేది కొన్ని నిమిషాలే అయినా అదెంతో బాగుంది’’ అని పేర్కొన్నారు. విజయ్‌ సేతుపతి చేస్తున్న చిత్రాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆయన్ను మరోసారి కలవాలని ఆకాంక్షించారు.  ప్రస్తుతం విజయ్‌ సేతుపతి నటించిన ‘ఏస్‌’ మూవీ ఈ నెల 23న విడుదల కానుంది. తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.  

Updated Date - May 18 , 2025 | 05:37 PM