Vijay Sethupathi: నా కంటే.. నా భార్యకు సంతోషంగా ఉంది

ABN , Publish Date - Jun 29 , 2025 | 11:23 AM

ప్రముఖ నటుడు విజయ్ సేతు పతి కుమారుడు హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.

vijay

ఏ విషయంలోనైనా తన కుమారుడు సూర్య స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలన్నదే తన కోరిక అని ప్రముఖ నటుడు విజయ్ సేతు పతి (Vijay Sethupathi) అన్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఫోనిక్స్ (Phoenix ). సూర్య విజయ్ సేతుపతి (Surya Sethupathi), అభినక్షత్ర, వర్ష హీరో, హీరోయిన్లుగా న‌టిస్తోండ‌గా వరలక్ష్మి కరణ్ కుమార్, సంపత్ ప్రధాన పాత్రలను పోషించగా శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు.

ఇలీవ‌ల జ‌రిగిన‌ ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకకు విజయ్ సేతుపతి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ రిలీజ్ చేసి మాట్లాడుతూ. 'దర్శకుడు ఆనల్ అరసుకు ప్రత్యేక దన్యవాదాలు. 2019లో ఈ కథ చెప్పిన‌ప్ప‌టికీ ఆ సమయంలో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు వీలుపడలేదు. ఆ తర్వాత ఈ స్టోరీలో నటిస్తే ఎలా ఉంటుందని సూర్వ అడిగాడు. ఒక వైపు సంతోషం, మరోవైపు భయం. ఏ నిర్ణ‌యమైన నీవే స్వతంత్రంగా తీసుకోవాలని చెప్పా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చిస్తా కానీ, సూర్య విష‌యంలో స్వతంత్రంగా నిర్ణ‌యం తీసుకోవాలని సూచించా. నా బిడ్డకు ఇలాంటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. నా కంటే నా భార్యకు సంతోషంగా ఉంది' అన్నారు.

GuiXZ1SXYAATy9U.jpeg

హీరో సూర్య మాట్లాడుతూ.. 'ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు దన్యవాదాలు. కొన్ని సందర్యాల్లో నిరుత్సాహంగా ఉన్న సమయంలో చిత్ర యూనిట్ ఎంత‌గానో ప్రోత‌స‌హించారు. సీనియ‌ర్ న‌టి దేవదర్శిని సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోనూ అమ్మ‌లాంటిదే కూడా నామ వంటివారు. దర్శకుడు ఆనల్ అరను అనేక విషయాలు నేర్పించారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నా' అన్నాను. దర్శకుడు ఆనల్ అరను మాట్లాడుతూ.. 'దాదాపు 200కు పైగా చిత్రాలకు స్టంట్ మాస్ట‌ర్‌గా పనిచేశా. కానీ దర్శకుడిగా నాకు ఇది తొలి చిత్రం ప్రతి ఒక్కరూ అశీర్వ‌దించాల‌ని కోరాడు.

Updated Date - Jun 29 , 2025 | 11:23 AM