Vijay Sethupati: నా జీవితంలో ఆ దీపాన్ని వెలిగించిన మనిషి ఆయనే

ABN, Publish Date - May 19 , 2025 | 02:40 PM

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విలక్షణ నటుడు ఆయన. తన నటనతో నటించిన అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విలక్షణ నటుడు ఆయన. తన నటనతో నటించిన అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అభిమానుల్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ‘ఏస్‌’ (ACE movie)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కెరీర్‌ తొలి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.

‘‘నటనను వృత్తిగా ఎంచుకుని అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ‘వర్ణం’ అనే సినిమాకు ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడికి వెళ్లాక సన్నివేశం చెప్పి డైలాగులు కూడా నన్నే రాసుకొని నటించమని అడిగారు. నేను డైలాగులు కూడా రాయగలనని అప్పుడే తెలుసుకున్నాను. ఆర్ముగ కుమార్‌ (Arumuga Kumar) ఆ టీమ్‌కు నా పేరు సజెస్ట్‌ చేశారు. అలా ఆ సినిమాలో అవకాశం వచ్చింది. అలాగే కల్ట్‌ క్లాసిక్‌ మూవీ ‘96’లో నేను నటించడానికి కూడా ఆయనే కారణం. ‘దయచేసి ఒకసారి ఈ సినిమాకు విజయ్‌ సేతుపతి ఆడిషన్‌ తీసుకోండి. పాత్రకు సరిపోడు అనుకుంటే తిరస్కరించండి’ అని ఆర్ముగ కుమార్‌ ‘96’ (96 movie) టీమ్‌కు చెప్పారు. మనకు ఒక స్థాయి వచ్చాక ఎవరైనా మనకు సాయం చేయడానికి ముందుకొస్తారు. కానీ మనం ఎవరో తెలియనప్పుడు కూడా సాయం చేయడం గొప్ప విషయం. ఆ సాయం చిమ్మ చీకటితో నిండిన ఇంటిలో దీపం వెలిగించడం లాంటింది. ఆరోజు నా జీవితంలో ఆ దీపాన్ని వెలిగించిన మనిషి ఆర్ముగ కుమార్‌. అతడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని విజయ్‌ సేతుపతి అన్నారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి, రుక్మిణి వసంత్‌ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్‌  క్రైమ్‌ కామెడీ సినిమా ‘ఏస్‌’  తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 23న విడుదల కానుంది. ఆర్ముగకుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

Updated Date - May 19 , 2025 | 02:51 PM