సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay: జీవితంలో ఎప్పుడూ ఇంత బాధ పడలేదు.. కరూర్ తొక్కిసలాటపై విజయ్ వీడియో సందేశం

ABN, Publish Date - Sep 30 , 2025 | 04:59 PM

కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, తొలిసారి స్పందించిన టీవీకే అధినేత విజయ్, వీడియో సందేశంలో తీవ్ర బాధ వ్యక్తం చేశారు.

Vijay

కరూర్ (Karur) ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట (Stampede)పై సినీ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ (Vijay) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ ఇంతగా బాధ పడలేదని అన్నారు. 'ఈ సంఘటన జరగకుండా ఉండాల్సింది.. కానీ జరగకూడదనే జరిగింది' అని ఒక వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన తర్వాత తొలిసారి ఆయన ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు.

'నా జీవితంలో ఇంతటి బాధాకర పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. చాలా బాధతో ఉన్నాను. రాజకీయాల మాట అటుంచుదాం. సురక్షితమైన ప్రాంతంలో అనుమతి ఇవ్వాలని పోలీసులను ప్రతిసారి మేము కోరుతూనే ఉన్నాం. కానీ ఏదైతే జరగకూడదో అదే జరిగింది. త్వరలోనే బాధిత కుటుంబాలను కలుసుకుంటాను' అని విజయ్ తెలిపారు.

వారిని ఏమి చేయవద్దు

టీవీకే నేతల అరెస్టుపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దని, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే తనపైన తీర్చుకోవాలని అన్నారు. పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసారని చెప్పారు. 'ముఖ్యమంత్రి సార్.. ఒక విన్నపం. మా పార్టీ కార్యకర్తలకు ఎలాంటి హాని చేయవద్దు. మీరు నా ఇంటికి రావచ్చు, ఆఫీసుకు రావచ్చు. ఎలాంటి చర్యనైనా నామీద తీసుకోండి. కానీ వాళ్లపై వద్దు. త్వరలోనే నిజం నిగ్గు తేలుతుంది' అని విజయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 05:08 PM