V Sekhar: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
ABN, Publish Date - Nov 15 , 2025 | 06:29 AM
సీనియర్ సినీ దర్శకుడు, దర్శక నటుడు కె.భాగ్యరాజ్ శిష్యుడు వి. శేఖర్ (73) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.
సీనియర్ సినీ దర్శకుడు వి. శేఖర్ (73) (V Sekhar) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. కోడంబాక్కంలో నివసిస్తున్న ఆయన పది రోజులుగా ఆనారోగ్యం -కారణంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స -పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతికి కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపం, సానుభూతిని వ్యక్తం చేశారు.
'సింగలుమ్ -హీరోదాన్' అనే చిత్రం ద్వారా 1990లో దర్శకు డిగా పరిచయమైన వి. శేఖర్ "పొండాట్రి సొన్న -కేక్కనుమ్', 'విరలుక్కేత్త వీక్కం', 'వరవు ఎట్టణ సెలవు పత్తణ' వంటి ఎన్నో విజయవం తమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఒక చిత్రంలో ప్రముఖ హాస్య నటులు దివంగత వివేక్, వడివేలును తొలిసారి వెండితెరపై చూపించారు.
తిరువణ్ణామలై జిల్లా నెయ్విత్తం గ్రామానికి చెందిన ఆయన తన 19 యేట ఏవీఎం స్టూడియోలో 'బ్లాక్ అండ్ వైట్ 16 ఎంఎం ల్యాబ్లో అసిస్టెంట్ గా చేరారు. ఆ తర్వాత చెన్నై కార్పొరేషన్‌లో ఆరోగ్య శాఖ విభాగంలో 15 యేళ్ళ పాట పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే నందనం అర్ల్స్ కాలేజీలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత పారైమ్ ఎడిటర్‌గా చేరారు.
దర్శక నటుడు కె.భాగ్యరాజ్ శిష్యుడు గోవిందరాజ్ దర్శకత్వం వహించిన కణ్ణ తోర్కనుం సామి' అనే చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన తర్వాత కె.భాగ్యరాజ్ వద్ద రెండేళ్ళపాటు కథ రచనా విభాగంలో కొనసాగారు. 1990లో తొలిసారి దర్శకత్వం వహించి విజయాన్ని అందుకున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవన విధానం. కుటుంబ సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా పలు చిత్రాలు తీశారు..