సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

AVM Saravanan: అగ్ర నిర్మాత ఏవీఎం శరవణన్‌ ఇక లేరు

ABN, Publish Date - Dec 04 , 2025 | 08:49 AM

కోలీవుడ్‌ నిర్మాత, ఏవీఎం ప్రొడక్షన్స్‌ అధినేత ఎం.శరవణన్‌(86) కన్ను మూశారు


కోలీవుడ్‌ నిర్మాత, ఏవీఎం ప్రొడక్షన్స్‌ అధినేత ఎం.శరవణన్‌(Saravanan) 86) కన్ను మూశారు. వయోభారంతోపాటు పలు ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం 3.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఏవీఎం బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 300లకు పైగా సినిమాలను నిర్మించారు. (AVM Producer Saravanan is no more)

తెలుగులో 'సంసారం ఒక చదరంగం', 'ఆ ఒక్కటీ అడక్కు', 'మెరుపు కలలు', 'జెమినీ', 'శివాజీ' చిత్రాలను నిర్మించారు. శరవణన్‌ మృతితో చిత్ర పరిశ్రమ శోకసంద్రంతో నిండిపోయింది. బుధవారం పుట్టినరోజు నిర్వహించుకొన్న ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తమిళ సినిమాకు ఎనలేని సేవలు అందించారని సన్నిహితులు చెబుతున్నారు.

ఎం. శరవణన్‌ తండ్రి, ప్రసిద్థ సినీ దిగ్గజం ఏ.వి. మేయ్యప్పన్‌ 1946లో ఐకానిక్‌ ఏవీఎం స్టూడియోస్‌ను స్థాపించారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ శరవణన్ ఏవీఎం నిర్మాణ సంస్థ బాధ్యతలు చేపట్టి అనేక దశాబ్దాలపాటు సినిమా ప్రయాణాన్ని ముందుకు నడిపించారు. అతని నాయకత్వంలో ఏవీఎం ప్రొడక్షన్స్‌ అనేక భాషల్లో క్లాసిక్‌ చిత్రాలను తెరకెక్కించారు.

శరవణన్‌ భౌతికకాయాన్ని గురువారం మధ్యాహ్నాం 3.30 గంటల వరకే అభిమానుల సందర్శనార్థం ఏవీఎం స్డూడియో మూడో ఫ్లోర్‌ ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.  
 

Updated Date - Dec 04 , 2025 | 10:15 AM