Love Marriage: పెళ్లి కోసం ఎన్ని కష్టాలో..
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:00 PM
తాను హీరోగా నటించిన కొత్త చిత్రం ‘లవ్ మ్యారేజ్’ అన్ని వర్గాల ఆడియెన్స్ చూసి ఎంజాయ్ చేసేలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామని హీరో విక్రమ్ ప్రభు అన్నారు.
తాను హీరోగా నటించిన కొత్త చిత్రం ‘లవ్ మ్యారేజ్’ (Love marriage) అన్ని వర్గాల ఆడియెన్స్ చూసి ఎంజాయ్ చేసేలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామని హీరో విక్రమ్ ప్రభు (vikram Prabhu) అన్నారు. ఈ నెల 27న విడుదలకానున్న ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు సరసన బెంగళూరుకు చెందిన సుష్మిత భట్ హీరోయిన్‌గా నటించారు. ఇతర పాత్రల్లో రమేష్ తిలక్, మీనాక్షి దినేష్, అరుల్‌దాస్, మురుగానందం, కోడంగి వడివేలు తదితరులు నటించారు. డాక్టర్ శ్వేతాశ్రీ, శ్రీనిధి సాగర్ నిర్మించారు. షణ్ముగ ప్రియన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక గురువారం జరిగింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా హారై ఆడియో రిలీజ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
హీరో విక్రమ్ ప్రభు మాట్లాడుతూ ‘'మొదటి నుంచి వైవిధ్యభరితమైన కథా చిత్రాలను ఎంచుకుంటూ నటిస్తున్నాను. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందుతుంది. మూడు పదులు దాటిన యువకుడు పెళ్ళి చేసుకునేందుకు ఎన్ని కష్టాలు పడతాడో ఫన్నీగా ఇందులో చెబుతున్నాం. ఎప్పటిలాగే నన్ను, నా చిత్రాలను ఆదరిస్తున్న మీడియా మిత్రులు, ప్రేక్షకులు ఈ మూవీని కూడా విజయవంతం చేయాలని కోరారు.
నిర్మాత డాక్టర్ శ్వేతశ్రీ మట్లాడుతూ ‘ప్రతి ఒక్కరికీ తొలి బిడ్డ ఎంతో స్పెషల్. అది దేవుడు బహుమతిగా భావిస్తారు. ఆ ప్రకారంగా మా బ్యానరులో వచ్చే తొలి చిత్రం ఇది. నేను కొలిచే వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ నెల 27వ తేదీ విడుదల చేస్తున్నాం’ అని వెల్లడించారు.
దర్శకుడు షణ్ముగ ప్రియన్ మాట్లాడుతూ ‘ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తర్వాత విక్రమ్ ప్రభు హీరో అని ఆరంభంలోనే ఫిక్సయ్యాను. కానీ, నా స్నేహితులు అనేక మంది విక్రమ్ ప్రభు యాక్షన్ హీరో.. అతనికి ఈ స్క్రిప్ట్ సెట్ కాదని కామెంట్స్ చేశారు. ‘ఇరుగపట్రు’లో విక్రమ్ ప్రభు నటనలోని మరో కోణాన్ని చూశాను. ఆ తర్వాత స్వయంగా కలిసి కథ వినిపించగా, నాపై పూర్తి నమ్మకంతో ఓకే చెప్పారు. పెళ్ళి కాని ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఈ సమాజం అనేక విషయాలను వయసుతో పోల్చుతుంది. దానిపై ప్రశ్నలు సంధిస్తూనే ఉంటుంది. వీటికి ఫన్నీగా సమాధానాలు చెప్పాం’ అని పేర్కొన్నారు.