సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Trisha: విజయ్‌తో కన్ఫామ్‌ చేసినట్టేనా.. త్రిష్‌ ఇన్‌డైరెక్ట్‌ కౌంటర్‌..

ABN, Publish Date - Jun 24 , 2025 | 04:33 PM

మరోసారి త్రిష రిలేషన్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా  విజయతో తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేసిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

త్రిష(Trisha), విజయ్‌ (Vijay) మధ్య ఏదో నడస్తుందనే టాక్‌ చాలా కాలంగా ఉంది. త్రిష ఈ విషయంపై ఎన్ని సార్లు ఖండించిన రూమర్స్‌ అయితే ఆగడం లేదు. అందుకు ఆమె కూడా ఓ కారణమే. గతేడాది విజయ్‌తో విదేశాల్లో దిగిన  ఫొటోలు షేర్‌ చేయగా ఇలాగే ఇద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్‌ గుప్పుమన్నాయి. తాజాగా అదే విషయంపై త్రిష మరోసారి వార్తలో నిలిచారు. విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్‌ పెట్టింది. 

గతేడాది త్రిష.. విజయ్ బర్త్ డేకు ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేసి విషెస్ తెలిపింది. లిఫ్ట్ లో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో కావడం, అందులోనూ విజయ్ లియో సినిమా గెటప్ లో ఉండడంతో.. వారిద్దరూ సినిమా సెట్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో అయినప్పటి రూమర్స్  వచ్చాయి.  తదుపరి  ది గోట్ సినిమాలో త్రిష ఐటెం సాంగ్ చేయడంతో మరోసారి రిలేషన్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి త్రిష.. తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేసిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. తాజాగా విజయ్ బర్త్ డే కి త్రిష స్పెషల్ గా విష్ చేసింది. విజయ్ తో ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ 'హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్‌' అంటూ రాసుకొచ్చింది. విజయ్, త్రిష ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్లని ఎత్తుకొని ముద్దు చేస్తుండగా.. వారిద్దరినీ చూస్తూ మురిసిపోతూ కనిపించింది. అదే ఫొటోను ఆమె తల్లి షేర్‌ చేస్తూ హార్ట్‌ ఎమోజీ జోడించింది. దీందో మరోసారి త్రిష వార్తలోకి వచ్చారు. ఈ విషయమై  ప్రేమపైౖ త్రిష పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీ పెట్టారు. 'పూర్తిగా ప్రేమలో మునిగిపోతే, అది కొందరిని తికమక చేస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.



కొందరు నెటిజన్లు మాత్రం త్రిషకు ఫేవర్‌గా ఉంటే మరికొందరు మాత్రం ఈ సూక్తులు కాదు.. మీ ఇద్దరి మధ్య ఏముందో అది చెప్పండి’’ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ మధ్యకాలంతో త్రిష కుర్ర హీరోలతోపాటు ఎక్కువ విజయ్‌ చిత్రాల్లోనే కనిపిస్తుంది. ప్రతి పుట్టినరోజుకు విజయ్‌పై ప్రత్యేక అభిమానం చూపిస్తూ పోస్టులు పెడుతుంటారు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ ఉండని బలంగా నమ్ముతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం త్రిష తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. 

Updated Date - Jun 24 , 2025 | 04:40 PM