సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sasikumar: విద్యా సంస్థల్లో.. సినిమా ప్రమోషన్ నచ్చదు

ABN, Publish Date - Jul 08 , 2025 | 10:49 PM

ప్రముఖ నటుడు మరియు టూరిస్ట్ ఫ్యామిలీ ఫేం శశికుమార్, సినిమా ప్రమోషన్లకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

sasi

సినిమా ప్రమోషన్లు, ఆడియో, ట్రైలర్ రిలీజ్ కోసం విద్యా సంస్థలను ఉప యోగించుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ప్రముఖ నటుడు టూరిస్ట్ ప్యామిలీ (Tourist Family) ఫేం శశికు మార్ (Sasikumar)అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు కేవలం విద్య భోదించడానికి మాత్రమేనని, అలాంటి చోట సినిమా కార్యక్రమాల నిర్వహణకు తాను పూర్తిగా వ్యతిరేకమని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. శశికు మార్, లిజో మోల్ జోస్ (Lijomol Jose) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఫ్రీడమ్ (Freedom ). ఇతర పాత్రల్లో సుదేష్ నాయర్, మాళవిక, బోస్ వెంకట్, రమేష్ ఖన్నా తదితరులు నటించారు. ఈ నెల 10వ తేదీ విడుదలకానుంది. ఈ దీనిని పురస్కరిం చుకుని చిత్రం ఆడియో శనివారం నగరంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో హీరో శశికుమార్ మాట్లాడుతూ, 'ఈ మూవీ యాదృచ్ఛికంగా జరిగింది. ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు. నిజానికి 'టూరిస్ట్ ఫ్యామిలీ'కి ముందే విడుదల కావాల్సి ఉంది. 'సుదంతిరం (స్వాతంత్య్రం) అనే టైటిల్ పెట్టాలని ముందుగా భావించాం. టైటిల్ తో ఒక సినిమావచ్చింది. 'విడుదలై' అనే పేరు పెట్టేందుకు వీలులేదు.. ఇపుడు ప్రతి ఒక్కటీ ఓటీటీ చేతుల్లోకి ఉంది. చివరకు టైటిల్స్ కూడా వారి నియంత్రణలోనే ఉన్నాయి. అందుకే 'ఫ్రీడమ్' అనే టైటిల్ ఎంచుకున్నాం. భవిష్యత్లో నా చిత్రాలను విద్యా సంస్థల్లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తే అది మేకర్స్ నిర్ణయమే గానీ, నా వ్యక్తిగత నిర్ణయం కాదని శశికు మార్ స్పష్టం చేశారు.

Updated Date - Jul 08 , 2025 | 10:49 PM