సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Abhishan Jeevinth: ఘ‌నంగా.. 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్ వివాహం

ABN, Publish Date - Nov 01 , 2025 | 07:06 AM

టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) దర్శకుడు అభిషన్ జీవంత్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు అఖిలను శుక్రవారం వివాహం చేసుకున్నాడు.

Abhishan Jeevinth

టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) దర్శకుడు అభిషన్ జీవంత్ (Abhishan Jeevinth) ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు అఖిలను శుక్రవారం వివాహం చేసుకున్నాడు.

ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' బ్లాక్‌బ‌స్టర్ హిట్‌గా నిలిచింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది.

ఈ విజయంతో అభిషన్ కోలీవుడ్ హిట్ యంగ్ దర్శకుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్ వంటి అగ్రనటుల ప్రశంసలు కూడా పొందారు.

ఈ నేపథ్యంలో తన చిన్ననాటి ప్రియురాలు అఖిల (Akila) ను శుక్రవారం వివాహం చేసుకున్నాడు. స్థానిక పోయెస్ గార్డెన్లో వీరిద్దరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతికొద్దిమంది సినీ ప్రముఖుల సమక్షంలో కోలాహలంగా జరిగింది.

ఈ వివాహాన్ని పుర‌స్క‌రించుకుని 'టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత రెండు రోజుల క్రితం ఓ ఖ‌రీదైన BMW కారును గిఫ్ట్‌గా ఇవ్వ‌గా సంబంధిత న్యూస్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది. మ‌రోవైపు అభిష‌న్ హీరోగా న‌టించిన త‌మిళ‌ చిత్రం సైతం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు ముస్తాబ‌వుతుండ‌డం విశేషం.

Updated Date - Nov 01 , 2025 | 07:17 AM