సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thug Life Collection: 'ఇండియన్ 2' కంటే దారుణమా

ABN, Publish Date - Jun 06 , 2025 | 06:41 PM

ఆ క్రేజీ కాంబినేషన్ 38 సంవత్సరాల తర్వాత రిపీట్ అయ్యింది. బిగ్ స్క్రీన్ పై ఈసారి భారీ సెన్సేషన్ ఖాయమని అంచనా వేశారు అంతా. కానీ ఆ అంచనాలు తప్పాయి.. ఫస్ట్ డే కలెక్షన్లు డిజప్పాయింట్ చేశాయి.

పాన్ ఇండియా స్థాయిలో కమల్ హాసన్ (Kamal Haasan) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ‘థగ్ లైఫ్’ (Thug Life). మణిరత్నం (Mani Ratnam) డైరెక్షన్‌లో వచ్చిన ఈ భారీ తమిళ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 38 ఏళ్ల తర్వాత మణి - కమల్ కాంబో రావడంతో సినీ లవర్స్ కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. కర్ణాటకలో కమల్ కన్నడంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా సినిమాని అక్కడ రిలీజ్ చేయలేదు. అక్కడ సినిమాను విడుదల చేయకపోయినా మిగిలిన భాషల్లో కుమ్మేస్తుందని అనుకున్నారు మేకర్స్. కానీ ఆడియన్స్ ఆశలతో పాటు కమల్ నమ్మకం కూడా నీరుగారినట్టే కనిపిస్తోంది. ‘థగ్ లైఫ్’ తొలి రోజు కలెక్షన్స్ దారుణంగా నమోదయ్యాయి.


కమల్ గత చిత్రం ‘ఇండియన్ 2’ (Indian 2) తొలి రోజు రూ. 25.2 కోట్ల గ్రాస్ రాబట్టగా, జూన్ 5న థియేటర్లలోకి వచ్చిన ‘థగ్ లైఫ్’ కేవలం రూ.17 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ‘ఇండియన్ 2’తో పోలిస్తే ఈ కలెక్షన్స్ చాలా తక్కువ. కర్ణాటకలో రిలీజ్ కాకపోవడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణం, ఎందుకంటే ‘ఇండియన్ 2’ అక్కడ తొలి రోజు రూ. 3.45 కోట్లు వసూలు చేసింది. కర్ణాటక రిలీజ్ లేకపోవడంతో మొత్తం గ్రాస్ రెవెన్యూలో 7% నష్టం జరిగే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.

ఇక సినిమా కథ, కథనంపై కూడా ఆడియన్స్ నుండి నిరాశాజనక స్పందన వస్తోంది. 163 నిమిషాల ఈ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ డ్రామాని చూసినవారు, “ఇది నిజంగా మణిరత్నం సినిమానా?” అని సందేహిస్తున్నారు. కమల్ హాసన్‌తో పాటు శింబు టీఆర్ (Silambarasan T.R), త్రిష, (Trisha) నాజర్ (Nasser), జోజు జార్జ్ (Joju George), అభిరామి (Abhirami), భగవతి పెరుమాళ్ (Bhagavathi Perumal), అశోక్ సెల్వన్ (Ashok Selvan), ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi), సన్యా మల్హోత్రా (Sanya Malhotra) , అలీ ఫజల్ (Ali Fazal) లాంటి స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి... ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో...

Updated Date - Jun 06 , 2025 | 06:46 PM