Theater Releases: టాలీవుడ్ టు హాలీవుడ్.. ఈ వారం దేశ వ్యాప్తంగా థియేటర్ సినిమాలివే
ABN, Publish Date - Jul 09 , 2025 | 08:20 AM
శుక్రవారం రోజున మన దేశ వ్యాప్తంగా ప్రధాన భాషల్లో ఓ నలభై వరకు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
జూలై నెల రెండో వారం శుక్రవారం రోజున మన దేశ వ్యాప్తంగా ప్రధాన భాషల్లో ఓ నలభై వరకు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో తెలుగు, తమిళ భాషల నుంచి ఏడు చొప్పున వస్తుండగా కన్నడ నుంచి3, హిందీ నుంచి 4, మలయాళం, బెంగాలీల నుంచి రెండేసి చొప్పున విడుదల కానున్నాయి. ఇంగ్లీష్, పంజాబీ, గుజరాతీ, ఒడియా లాంగ్వేజెస్ నుంచి ఓక్కొటి థియేటర్లలో (Theatre) రిలీజ్ కానున్నాయి.
అయితే వీటిలో తెలుగులో సుహాస్ ఓ భామ అయ్యో రామ, మొగలి రేకులు ఫేం సాగర్ నటించిన ది 100, సోషల్ మీడియా ఫేం మిత్రా శర్మ విర్జిన్ బాయ్స్ తో పాటు తమిళ లేటెస్ట్ హిట్ చిత్రం డీఎన్ఏ చిత్రాన్ని తెలుగులో మై బేబీ గా తీసుకు వస్తున్నారు. ఇక తమిళంలో ఇటీవల టూఇస్ట్ ఫ్యామిలీతో బ్లాక్బసట్ర్ కొట్టిన శశి కుమార్ నటించిన ఫ్రీడం, విష్ణు విశాల్ోహో ఎంతన్ బేబీ, విమల్, తెలుగమ్మాయి పూజిత పొన్నాగ నటించిన దేసింగు రాజా 2 వంటి చిత్రాలు ఉన్నాయి. హిందీలో విక్రాంత్ మెస్సే, రాజ్ కుమార్‌రావ్ నటించిన సినిమాలు పోటీ పడుతున్నాయి.
ఇక వీటన్నిటికంటే ముఖ్యంగా వరల్డ్ వైడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ మ్యాన్ సైతం ఈ వారమే ఇంగ్లీష్‌తో పాటు మరో 5 భాషల్లో ఎన్నొ అంచనాల మధ్య భారీగా విడుదలవుతుంది. సో సినీ లవర్స్.. మీ మీ ప్రాంతాలలో మీకు సౌలభ్యం అయిన భాషలో నచ్చిన సినిమాను థియేటర్లలో చూసి ఆస్వాదించండి.
ఈ వారం.. థియేటర్ సినిమాలివే
Telugu
The 100
My Baby
Superman
Virgin Boys
Oh Bhama Ayyo Rama
Dheerga Ayushman Bhava
Paramapadha Sopanam
Hindi
Maalik
Aankhon Ki Gustaakhiyan
Udaipur Files Kanhaiya Lal Tailor Murder
English
Superman
Tamil
Freedom Jul 10
Thotram
Superman
Mrs & Mr
Maayakoothu
Desingu Raja 2
Oho Enthan Baby
Malayalam
Kolahalam
Soothravakyam
Kannada
Lakshya
Jaava Coffee
1st Day 1st Show
Doora Theera Yaana
Bengali
C/O A Journey
Danter Lorai
Punjabi
Meri Pyari Dadi
Odia
I Am Kalia
Gujarati
Vahali
Tulu
Dharma Chavadi