సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naga Durga: నాగ‌దుర్గ బంఫ‌రాఫ‌ర్.. హీరోయిన్‌గా త‌మిళంలో ఎంట్రీ

ABN, Publish Date - Oct 28 , 2025 | 10:15 PM

గ‌డిచిన రెండు మూడు సంవ‌త్స‌రాలుగా వ‌రుస జాన‌పద గీతాల‌తో రెండు తెలుగు రాష్ట్రాల‌లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ది ఫోక్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ .

Naga Durga

గ‌డిచిన రెండు మూడు సంవ‌త్స‌రాలుగా వ‌రుస జాన‌పద గీతాల‌తో రెండు తెలుగు రాష్ట్రాల‌లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ది ఫోక్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ (Naga Durga). తెలంగాణ న‌ల‌గొండ‌కు చెందిన ఈ చిన్న‌ది ఇటీవ‌ల వ‌చ్చిన దారి పోంటోత్తుండు అనే పాట మ‌రింత క్రేజ్ తీసుకు రావ‌డ‌మే కాక‌ జాతీయ స్థాయిలో గుర్తింపు సైతం ద‌క్కించుకుంది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ‘కలివి వనం’ అనే స్ట్రెయిట్ తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా ఛాన్స్ ద‌క్కించుకుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పాట‌లు బాగా వైర‌ల్ అయ్యాయి. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌కు రానుంది.

ఇదిలాఉంటే ఈ అమ్మ‌డు ఇప్పుడు మ‌రో బంప‌రాఫ‌ర్ కొట్టేసింది. ఇటీవ‌ల ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా చిత్రంతో ఆక‌ట్టుకున్న న‌టుడు ప‌వీష్ (pavish) హీరోగా తెర‌కెక్కుతున్న ఓ కొత్త త‌మిళ చిత్రంలో క‌థానాయిక‌గా త‌మిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది.

మ‌గేశ్ రాజేంద్ర‌న్ (Magesh Rajendran) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆక్టోబ‌ర్ 27 సోమ‌వారం రోజు చెన్నైలో అధికారికంగా ప్రారంభం అయింది. వేస‌విలో ఈ చిత్రం ప్ర‌జ‌ల ముందుకు రానుంది.

Updated Date - Oct 28 , 2025 | 10:15 PM