సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Srimad Bhagavatam: గేమ్ ఆఫ్ థ్రోన్స్, మిషన్ ఇంపాజిబుల్ టీమ్‌తో.. శ్రీమద్ భాగవతం

ABN, Publish Date - Jul 15 , 2025 | 06:31 PM

సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మిస్తున్న శ్రీమద్ భాగవతం పార్ట్-1 చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో సోమ‌వారం ఘనంగా ప్రారంభ‌మైంది.

Srimad Bhagavatam

సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మిస్తున్న శ్రీమద్ భాగవతం పార్ట్-1 చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో సోమ‌వారం ఘనంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రామోజీ గ్రూప్ చైర్మన్ సీహెచ్ కిరణ్, నిర్మాత మోతీ సాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే యూనిక్ ఫిల్మ్ సిటీ. అలాంటి ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉండటం గర్వకారణం. శ్రీమద్ భాగవతం వంటి ఆధ్యాత్మిక చిత్రాలు నేటి తరానికి ఎంతో అవసరం. భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ చేసే స్థాయికి ఎదగాలని మా ఆశయం అని పేర్కొన్నారు.2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా మార్చే విజన్‌లో సినిమా రంగానికి ప్రత్యేక చాప్టర్ ఉంటుందని తెలిపారు.

న‌ల‌భై సంవ‌త్స‌రాల క్రితం 1987 స‌మ‌యంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మైన రామానంద్ సాగర్ రామాయ‌ణం సీరియ‌ల్ బృందంతో నాలుగు సంవ‌త్స‌రాల‌కు పైగా అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రిపి కథపై లోతైన దృష్టితో, భక్తి అంశాలలోకి లోతుగా వెళుతూ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి టెక్నికల్ టీమ్ ప‌ని చేస్తుండ‌గా విశేషం. హ్యారీ పాటర్, లైఫ్ ఆఫ్ పై, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి ప్రాజెక్టులలో పని చేసిన అనుభవం ఉన్న క్లైడ్ ఎడ్వర్డ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, మిషన్ ఇంపాజిబుల్, స్టార్ ట్రెక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 వంటి చిత్రాల‌కు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవ‌హ‌రించిన జోయెల్ షాఫర్ వంటి మ‌హామ‌హులు ఈ సినిమాకు ప‌ని చేస్తుండ‌గా IMAX సర్టిఫైడ్ కెమెరాలతో, వరల్డ్ క్లాస్ VFX తో ఈ సినిమా రూపొందుతోంది. 2026లో పాన్ ఇండియాగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది.

Updated Date - Jul 15 , 2025 | 06:31 PM