Kollywood: ఇద్దరు హీరోయిన్లు పెళ్ళిపీటలెక్కనున్నారు
ABN, Publish Date - Jul 19 , 2025 | 10:04 AM
కోలీవుడ్‌కు (kollywood) చెందిన ఇద్దరు హీరోయిన్లు పెళ్ళిపీటలెక్కనున్నారు. ఈ విషయాలను వారే తమతమ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.
కోలీవుడ్‌కు (kollywood) చెందిన ఇద్దరు హీరోయిన్లు పెళ్ళిపీటలెక్కనున్నారు. ఈ విషయాలను వారే తమతమ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. వీరిలో ఒకరు రిత్విక (Rithvika) కాగా, మరొకరు తాన్య రవిచంద్రన్ (Tanya Ravichandran). ‘కబాలి’, ‘పరదేశి’, ‘మద్రాస్’, ‘ఒరు నాల్ కూత్తు’ వంటి అనేక చిత్రాల్లో నటించిన రిత్విక... బిగ్‌బాస్ విజేత కూడా. వినోద్ లక్ష్మణన్ అనే యువకుడిని వివాహం చేసుకోనున్నారు.
అలాగే, ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలు, ‘కరుప్పన్’, ‘నెంజుక్కు నీది’, ‘అఖిలన్’, ‘రసవాది’ వంటి చిత్రాల్లో నటించిన తాన్య రవిచంద్రన్.. చిత్రపరిశ్రమలో కెమెరామెన్‌గా రాణిస్తున్న గౌతమ్‌ను వివాహం చేసుకోనున్నారు. పైగా తనకు కాబోయే భర్తతో ఆమె లిప్‌లాక్‌తో ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది.
ALSO READ: AR Rahman-Hans Zimmer: నేనే కాదు.. ఎవరూ ఊహించి ఉండరు
Vishwambhara updates: సత్యలోకం చూపించబోతున్నాం
Fish Venkat: హాస్య నటుడు.. ఫిష్ వెంకట్ కన్నుమూత