Surya: డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా టైటిల్ ప్రకటన

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:50 PM

జూన్ 20 తమిళ దర్శకుడు ఆర్జే బాలాజీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతను సూర్య తో తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్ ను ప్రకటించారు.

తమిళ స్టార్ హీరో సూర్య (Surya) ప్రస్తుతం ఆర్జే బాలాజీ (R.J. Balaji) దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. దర్శకుడు బాలాజీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు.


హీరో సూర్యకు గత కొంతకాలంగా సరైన సక్సెస్ అనేది లేకుండా పోయింది. అయినా వెనకడుగు వేయకుండా విభిన్నమైన చిత్రాలను చేయడానికి అతను వెనుకాడటం లేదు. అందులో భాగంగానే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమాకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆర్జే బాలాజీలో మంచి నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా ఉన్నాడు. నయనతార నాయికగా ఆర్జే బాలాజీ తన మిత్రుడుతో కలిసి 'అమ్మోరు తల్లి' (Ammoru Talli) మూవీని తెరకెక్కించాడు. ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత సత్యరాజ్ (Satyaraj) తో 'వీట్ల విశేషం' అనే సినిమాను రూపొందించాడు. ఇదీ సక్సెస్ సాధించింది. ఇలా వరుస విజయాలతో సాగుతున్న ఆర్జే బాలాజీకి సూర్య డేట్స్ ఇచ్చాడు. ఈ మూవీకి ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rehman) సంగీతం అందిస్తున్నారు. ఇదో ఫాంటసీ యాక్షన్ మూవీ అని సమాచారం.


ఇదిలా ఉంటే దాదాపు యేడాదికి పైగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్న ఆర్జే బాలాజీ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 20న టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమాకు 'కరుప్పు' అనే పేరు పెట్టారు. టైటిల్ పోస్టర్ ను చూస్తే... ఇందులో యాక్షన్ కు కొదవలేదని తెలుస్తోంది. 'కరుప్పు' (Karuppu) అంటే తమిళంలో నలుపు అని అర్థం. మరి ఈ సినిమా అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేస్తారా? లేక తెలుగు వర్షన్ కు వేరే ఏదైనా పేరు పెడతారా అనేది చూడాలి. తమ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీకి శుభాకాంక్షలు తెలుపుతూ, హీరో సూర్య మూవీ టైటిల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: Kubera Movie review: కుబేర సినిమా రివ్యూ

Also Read: War 2: ఇద్దరు స్టార్స్ ను డీల్ చేయడానికి అయాన్ తిప్పలు...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 20 , 2025 | 04:59 PM