Apeksha Porwal: ‘జైలర్-2’లో బాలీవుడ్ నటి
ABN, Publish Date - Nov 22 , 2025 | 10:59 AM
యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్-2’ మూవీ కోసం బాలీవుడ్ నటి అపేక్ష పార్వెల్‌ను ఎంపిక చేశారు.
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip kumar) దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న ‘జైలర్-2’ మూవీ కోసం బాలీవుడ్ నటి అపేక్ష పార్వెల్‌ను (Apeksha Porwal) ఎంపిక చేశారు. బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’కు సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటికే రమ్యకృష్ణ, మిర్నా మేనన్, యోగిబాబు, అతిథి పాత్రల్లో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ నటిస్తున్న విషయం తెల్సిందే. రెండో భాగంలో కొత్తగా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, ఎస్‌జే సూర్య కలిశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి అపేక్ష పార్వెల్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. దీంతో యూనిట్ సభ్యులతో అపేక్ష కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘జైలర్ 2’లో అవకాశం రావడం ఆమె జీవితంలో పెద్ద మలుపు. రజినీకాంత్ సరసన తెర మీద కనిపించడం, చాలామంది నటులు కలగా ఉంటుంది. హీరోయిన్ గా బెగినింగ్లోనే రజని సరసన అవకాశం దక్కడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ అవకాశం ఆమె కెరీర్ కు మైలు రాయిగా చెబుతోంది.
అపేక్ష 2020లో విడుదలైన ‘Undekhi’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అందులో ఆమె పోషించిన కోయల్ పాత్ర ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అనేక వెబ్‌సిరీస్‌లు, చిత్రాల్లో నటిస్తూ ఒక్కో కథతో, ఒక్కో పాత్రతో తన నటనలో మరింత మెరుగై, వినోద రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటోంది సన్ పిక్చర్స్ నిర్మాణంలో, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా ₹600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అందుకే సీక్వెల్‌పై ఇప్పటికే పాన్–ఇండియా స్థాయిలో భారీ ఆసక్తి నెలకొంది. అపేక్షకు ‘జైలర్ 2’ ఒక సినిమా కంటే ఎక్కువ. ఇది ఆమెకు దక్షిణాది సినిమా రంగంలో ఇచ్చే ప్రత్యేక ఎంట్రీ.