Vijay: విషాదం.. విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట.. 20 మంది మృతి
ABN , Publish Date - Sep 27 , 2025 | 09:14 PM
తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ అధినేత విజయ్ (Vijay) ప్రచార ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Vijay: తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ అధినేత విజయ్ (Vijay) ప్రచార ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 20 మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇందులో పార్టీ కార్యకర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ హీరో విజయ్.. ఏడాది క్రితం సినిమాలను వదిలి రాజకీయాల్లో ఏదో సాధించాలని టీవీకే పార్టీని స్థాపించాడు. ఇక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారం మొదలుపెట్టిన విజయ్.. సమయం చిక్కినప్పుడల్లా ఒక్కో దగ్గర ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నాడు. తాజాగా నేడు కరూర్ లో ఒక ప్రచార సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ ప్రచార సభకు లక్షల్లో జనం హాజరు అయ్యారు.
విజయ్ ను చూడాలని, ఆయన ప్రసంగం వినాలని అభిమానులు ఒకరిపై ఒకరు తోసుకుంటూ వచ్చేసరికి అక్కడ తొక్కిసలాట జరిగింది. వెంటనే పరిస్థితి గమనించిన విజయ్ వారికి మంచినీళ్లను కూడా అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 20 మంది మాత్రమే మృతి చెందినట్లు సమాచారం. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
Mohan Babu: వింటేజ్ లుక్ అదిరింది.. విలనిజం ఎలా ఉంటుందో
Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే