సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sreeleela: శ్రీలీల మరో జాక్‌పాట్‌.. సెట్‌ అయితే దశ తిరిగిపోతుంది..

ABN, Publish Date - Sep 19 , 2025 | 06:52 PM

స్వీటీ అనుష్క నటించిన ‘అరుంధతీ’ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం గురించి టాపిక్‌ నడుస్తూనే ఉంటుంది.   ఈ చిత్రంలో జేజమ్మగా అనుష్క నట విశ్వరూపం చూపించి ఫ్యాన్స్‌కు సూపర్‌ ట్రీట్‌ ఇచ్చింది.

స్వీటీ అనుష్క (Anushka) నటించిన ‘అరుంధతీ’ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం గురించి టాపిక్‌ నడుస్తూనే ఉంటుంది.   ఈ చిత్రంలో జేజమ్మగా అనుష్క నట విశ్వరూపం చూపించి ఫ్యాన్స్‌కు సూపర్‌ ట్రీట్‌ ఇచ్చింది.  ఆ చిత్రంతో అనుష్క స్టార్‌డమ్‌ అమాంతంగా పెరిగిపోయింది. అంతేకాదు స్టార్‌ హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ చిత్రం తెలుగులో మాత్రమే విడుదలైంది. అప్పట్లో ఈ చిత్రానికి రీమేక్‌ ప్రయత్నాలు చేశారు కానీ ఫలించలేదు. పదహారేళ్ల తర్వాత ఈ సినిమా రీమేక్‌ అవుతుందనే వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. రీమేక్స్‌లో స్పెషలిస్ట్‌ అయిన మోహన్‌ రాజా.. (Mohan Raja) అరుంధతీ (Arundhati Remake) సినిమాను తమిళంలో రీమేక్‌ చేయబోతున్నారని టాక్‌ నడుస్తోంది. అయితే ఇందులో అనుష్క పోషించిన పాత్రను ఎవరు చేస్తారనేఏది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీలీల 9Shreeleela) పేరు గట్టిగా వినిపిస్తోంది.


మోహన్‌ రాజా ఏదైనా సినిమా రీమేక్‌ చేస్తే అది కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుంది. తెలుగు సినిమాలు చాలా తమిళంలో రీమేక్‌ చేసి విజయం అందించారు. అరుంధతి సినిమా రీమేక్‌ అంటే ఆ సినిమా సినీ ప్రియులంతా క్రేజీగా ఫీల్‌ అవుతున్నారు. అయితే అనుష్క స్థానంలో శ్రీలీల నటించడం సర్‌ప్రైజింగ్‌ థింగ్‌ అనొచ్చు. ఈ మధ్యకాలంలో థ్రిల్లర్‌ సినిమాకు ఎంతగా ఆదరణ దక్కుతున్నాయో తెలిసిందే! అందుకే అనుష్క నటించిన అరుంధతి రీమేక్‌తో కోలీవుడ్‌ ఆడియన్స్‌ని మెపించాలని చూస్తున్నారు. ఈ సినిమా నిజంగా శ్రీలీలకు దక్కితే తమిళంలో ఆమె మంచి బూస్టింగ్‌ ఇచ్చినట్లే. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

Updated Date - Sep 19 , 2025 | 06:57 PM