Arasan: వెట్రిమారన్ సినిమా.. శింబు సరసన ఆ ముగ్గురు
ABN, Publish Date - Oct 13 , 2025 | 11:02 AM
కోలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో సిలంబరసన్ టీఆర్ సింబు తన కొత్త చిత్రంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో సిలంబరసన్ టీఆర్ (Silambarasan) అలియాస్ సింబు తన కొత్త చిత్రంలో ఉత్తర చెన్నై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ (Vetri Maaran) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆరసన్ (ARASAN) అనే టైటిల్ సైతం ఇటీవల ఖరారు చేశారు. అయితే ఇందులో ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్టు సమాచారం.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న చిత్రంలో ఇప్పటికే శింబు సరసన సాయి పల్లవి చేస్తున్నట్లు కాదు కాదు సమంత (Samantha ) నటిస్తున్నట్లు వార్తలు బాగా వైరల్ అయ్యాయి కూడా. అయితే ఈ వార్తలు కాదని ఇయన సరసన ముగ్గురు భామలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వారిలో సమంత, కీర్తి సురేష్ (Keerthy Suresh)పేర్లను ఖరారు చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
మరో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకునేందుకు సంప్రదిస్తున్నారు. శింబుతో సాయిపల్లవి (Sai Pallavi) నటించేందుకు అంగీకరిస్తే 'అరసన్' మూవీలో శింబు సరసన ముగ్గురు ప్రముఖ హీరోయిన్లు నటిస్తారు. మరోవైపు శ్రీలీల (Sreeleela) తోనూ మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఐనరి కె.గణేష్ నిర్మించనున్నారు. కాగా దీపావళిని పురస్కరించుకుని ఆక్టోబర్ 16 సాయంత్రం ఈ చిత్రం టప్రోమో వీడియో రిలీజ్ చేయనున్నారు.