Mandadi: సుహాస్.. సినిమా షూటింగులో ప్రమాదం! తీవ్ర నష్టం (Video)
ABN, Publish Date - Oct 05 , 2025 | 08:50 AM
సూరి, తెలుగు హీరో సుహాస్ నటిస్తున్న కొత్త చిత్రం 'మండాడి' (Mandaadi) షూటింగులో అపశృతి జరిగింది.
తమిళ నటుడు సూరి (Soori ) హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'మండాడి' (Mandaadi). తెలుగు హీరో సుహాస్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇదే సినిమా తెలుగులో వచ్చేసరికి సుహాస్ (Suhas) హీరోగా సూరి విలన్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ చెన్నై సముద్ర తీరంలో శర వేగంగా జరుగుతోంది.
తాజాగా.. షూటింగులో అపశృతి జరిగింది. ఈ చిత్ర షూటింగులో భాగంగా కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు.
రామనాథ పురం జిల్లా తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే, యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయింది. ఇదిలాఉంటే ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహాత వెట్రిమారన్ నిర్మిస్తుండడం విశేషం.