సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Hit3: నా క‌థ‌ కాపీ కొట్టారు.. హైకోర్టులో నాని వీరాభిమాని కేసు

ABN, Publish Date - Jun 19 , 2025 | 06:34 PM

ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను హిట్‌, సైంథ‌వ్ సినిమాల విష‌యంలో కొన్ని సినిమాల‌ను కాపీ కొట్టాడంటూ అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు బాగానే వ‌చ్చాయి.

hit3

నాని (Nani), శైలేష్ కొల‌ను (Sailesh Kolanu) కాంబినేష‌న్‌లో హిట్ వ‌ర్స్‌లో భాగంగా హిట్‌1, హిట్2 చిత్రాల‌కు సీక్వెల్‌గా మే1న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి భారీ విజ‌యం సాధించిన చిత్రం హిట్‌3 (HIT: The Third Case). విడుద‌లైప అన్ని చోట్లా మంచి టాక్తో ర‌న్ అవుతూ.. రూ. 200 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు సాధించి నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే సినిమాలో మితీమిరీన హింస ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చాక కూడా చాలా మంది ఈ సినిమాను వీక్షించారు.

ఇదిలాఉంటే .. గ‌తంలో ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను హిట్‌, సైంథ‌వ్ సినిమాల విష‌యంలో కొన్ని సినిమాల‌ను కాపీ కొట్టాడంటూ అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు బాగానే వ‌చ్చాయి. కాల‌క్ర‌మంలో ఆడియ‌న్స్ ఆ విష‌యాన్ని మ‌రిచి పోయినా ఏదో ఓ సంద‌ర్భంలో కాపీ విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తూ పంటి కింద రాయిలా త‌గులుతూ ఉంటాయి. ఇటీవ‌ల వ‌చ్చిన హిట్‌3 విష‌యంలోనూ ఇలాంటి వార్త‌లు బాగానే వ‌చ్చాయి. హీరో, హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఓ తెలుగు సీరియ‌ల్‌ను మ‌క్కీ టు మ‌క్కీ దించేశారంటూ స‌ద‌రు వీడియోలు బ‌య‌ట పెట్టి ట్రోల్ చేశారు. అంతేకాదు సినిమా సైతం స్క్విడ్ గేమ్‌ను కాపీ చేశారంటూ చాలామంది బాహాటంగానే కామెంట్లు చేశారు కూడా.

అయితే తాజాగా మ‌రోసారి హిట్ 3 సినిమా విష‌యంలో ఇలాంటి వార్త‌లు వెలుగులోకి వ‌చ్చాయి. అది కూడా నానికి వీరాభిమాని అయిన ఓ మ‌హిళా ర‌చ‌యిత విమల్ సోనీ (Sonia Vimal) చేయ‌డం గ‌మ‌నార్హం. తాను రాసిన ఏజెంట్ 11, ఏజెంట్ వీ కథలను కాపీ కొట్టి హిట్ 3 సినిమా తీశారని పేర్కొంటూ స‌ద‌రు ర‌చ‌యిత HIT3 సినిమా మేకర్స్ పై మద్రాస్ హైకోర్టు (Madras High Court) లో కాపీ రైట్ కేసు వేసి షాకిచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో పెద్ద‌ ర‌చ్చే చేస్తుంది. దీంతో త‌ర్వాత ఏం జ‌రుగ‌బోతుంద‌నే ఉత్సుక‌త సినీ ల‌వ‌ర్స్‌లో ఏర్ప‌డింది.

Updated Date - Jun 19 , 2025 | 06:36 PM