సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sivakarthikeyan: న‌న్ను దేవుడిగా చూసే.. ఫ్యాన్స్‌ వ‌ద్దు! పేరెంట్స్‌ను.. చూసుకునే వారు చాలు

ABN, Publish Date - Dec 03 , 2025 | 09:48 AM

నన్ను దేవుడుగా ఆరాదించే అభిమానులు నాకు అక్కర్లేదు, తల్లిదండ్రులను, దేవుడిని పూజిస్తూ, ప్రేమగా మాట్లాడితే చాలు ఒక సోదరుడిగా ఉండేందుకే ఇష్టపడుతున్నా అంటూ శివకార్తికేయన్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Sivakarthikeyan

ఇపుడు సోషల్ మీడియా అంటే 'ప్రతి ఒక్కరూ భయంతో వణికి పోతున్నారని హీరో శివకార్తికేయన్ అన్నారు. ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ఆవిష్కరణ తాజాగా చెన్నైలో జరిగింది. ఇందులో శివకార్తి కేయన్ (Sivakarthikeyan ) మాట్లాడుతూ, 'నాతో పాటు ఈ వేదికపై ఉన్న ముగ్గురికి తెలివితేటలు ఎక్కువ. నాకు తక్కువ. అందువల్లే నటుడిగా కొనసాగుతున్నాను.

తెలివితేటలు ఎక్కువగా ఉన్నట్లయితే దర్శకులను వేదించేవాడిని ఇప్పుడు వారు చెప్పినట్లుగా నడుచుకుంటున్నాను నన్ను దేవుడుగా ఆరాదించే అభిమానులు నాకు అక్కర్లేదు, తల్లిదండ్రులను, దేవుడిని పూజిస్తూ, ప్రేమగా మాట్లాడితే చాలు ఒక సోదరుడిగా ఉండేందుకే ఇష్టపడుతున్నాను. అందుకే ఎల్లవేళలా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అంటూ సోదర భావంతో పిలుస్తుంటాను.

ఇపుడు సోషల్ మీడియా చూస్తేనే భయంగా ఉంటుంది. నాకు అన్ని సామాజిక మాధ్యమాల్లో నాకు ఖాతాలున్నాయి. కానీ, వాటిని వేర్వేరు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఇన్ఫ్రా వైపు వెళ్ళా లంటేనే భయంగా ఉంది. పొరపాటున ఏదైనా తప్పు దొర్లితే అది వైరల్‌గా మారుతోంది. పైగా మనం ఎపుడు తప్పు చేస్తామా. నోరు జారుతామా అని కొందరు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి చిక్కకుండా ఉండేందుకు సోషల్ మీడియా వైపు వెళ్ళడం లేదని పేర్కొన్నారు.

కాగా, ఈ ఫ్యాన్లీ ఎంటర్ టైన్మెంట్ యాప్‌ను శివకార్తికేయన్‌తో కలిసి పద్మభూషణ్‌ పుల్లెల గోపీచంద్. వరల్డ్ చెస్ చాంపియన్, మేజర్ డ్యాన్చంద్ ఖేల్‌ర‌త్న‌ పురస్కార గ్రహీత గుకేష్, ఉబెర్ క్యాబ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మణి కంఠన్ తంగరత్నం, ప్యాన్లీ యాప్ నిర్వాహకులు శరవణన్ కనక రాజు, శ్రీనివాసన్ బాబు తదితరులు కలిసి అవిష్కరించారు.

Updated Date - Dec 03 , 2025 | 11:42 AM