సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

AR Rahman: ఏఆర్ రెహమాన్ ను అభినందించిన సింగపూర్ అధ్యక్షుడు

ABN, Publish Date - Jun 05 , 2025 | 09:03 PM

ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) పై సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం(Singapore President Tharman)ప్రశంసలు కురిపించారు.

AR Rahman

AR Rahman: ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) పై సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం(Singapore President Tharman)ప్రశంసలు కురిపించారు. రెహమాన్.. స్థానిక సింగపూర్ కళాకారులతో కలిసి లే మస్క్(Le Musk) అనే మల్టీ-సెన్సరీ వర్చువల్‌ రియాలిటీ చిత్రంను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ మే నెలలో సింగపూర్‌లో అధికారికంగా విడుదలైంది. ఈ సందర్భంగా రెహమాన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

భాష, దేశాలకతీతంగా సంగీతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం హర్షణీయమైన విషయమని రెహమాన్ చెప్పుకొచ్చారు. " సింగపూర్ ప్రెసిడెంట్‌ను కలవడం గొప్ప గౌరవంగా అనిపించింది. సింగపూర్ ఆర్టిస్టులతో మళ్లీ పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. లే మస్క్ ప్రీమియర్స్ లో మీ అందరూ నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు" అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు, సినీ ప్రముఖులు రెహమాన్‌ను అభినందిస్తున్నారు.

Updated Date - Jun 05 , 2025 | 09:03 PM