Shobana: చెట్టు వెనుకకు వెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు
ABN, Publish Date - Jun 09 , 2025 | 03:43 PM
సీనియర్ నటి శోభన(Shobana) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Shobana: సీనియర్ నటి శోభన(Shobana) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్సర్ గా, హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఈ మధ్యనే ఆమె సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ఇచ్చి సత్కరించింది. సినిమాలు ఆపేసి నృత్యశాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్న శోభన గత కొంతకాలం గా మళ్లీ సినిమాలతో బిజీగా మారింది.
గతేడాది కల్కి2898 AD(Kalki 2898AD) సినిమాలతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన శోభన.. ఈ ఏడాది తుడరుమ్(Tuduram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం శోభన వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడపుడు కనిపించే ఆమె.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అభిమానులను పలకరించింది. వారి అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పుకొచ్చింది. ఈ లైవ్ లో ఒక అభిమాని.. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amithabh Bachchan తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ను పంచుకోమని కోరగా.. బిగ్ బి గొప్ప మనసు గురించి శోభన గతంలో జరిగిన ఒక చేదు ఘటన గురించి చెప్పుకొచ్చింది.
" అమితాబ్ చాలా మంచి వ్యక్తి. గొప్ప మనిషి. ఇప్పటికీ ఆయనేమి మారలేదు. ఆయనలోని మానవత్వం కొంచెం కూడా తగ్గలేదు. గతేడాది కల్కిలో అమితాబ్ తో కలిసి నటించాను. దీనికన్నా ముందు అమితాబ్ పక్కన హీరోయిన్ గా ఒక సినిమా చేశాను. ఆ సినిమాలోని ఒక పాట షూట్ కోసం అహ్మదాబాద్ వెళ్లాము. అక్కడ అమితాబ్ ను చూడడానిక చాలామంది తరలివచ్చారు. ఆ సాంగ్ లో ఒకటికి మించి ఎక్కువ కాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చింది. దీంతో క్యార్ వ్యాన్ ఎక్కడ అని టీమ్ లో ఉన్న ఒకరిని అడిగితే.. ఆమె కేరళ నుంచి వచ్చింది కదా. అక్కడివారు దేనికైనా సర్దుకుపోతారు. ఆ చెట్టువెనుకకు వెళ్లి బట్టలు మార్చుకోమను అని అన్నాడు. ఈ మాటను కార్ వాన్ లో ఉన్న అమితాబ్ వాకీటాకీ ద్వారా విని.. వెంటనే బయటకు వచ్చి అతనిపై మండిపడ్డారు. అతని బుద్ధిచెప్పి తన కార్ వాన్ ను నాకిచ్చారు. ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత కల్కి సెట్ లో కలిసాం. అలాగే కనిపించారు. ఎవరైనా వస్తే లేచి నిలబడి విష్ చేస్తారు. చాలా మంచి మనిషి " అని చెప్పుకొచ్చింది.