సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sivakarthikeyan: వెంకట్ ప్రభుతో శివకార్తికేయన్

ABN, Publish Date - Jun 09 , 2025 | 07:20 PM

ఇండ‌స్ట్రీలో ఎవ‌రి ఫేట్‌నైనా స‌రే.. ఒక ఫ్రైడే డిసైడ్ చేస్తుంది. అలా ఒక ఫ్రైడే సాలిడ్‌గా క‌లిసొచ్చిన హీరో.. దూసుకుపోతున్నాడు. దీప‌ముండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న‌ట్టు.. ఫేమ్ ఉండ‌గానే ర‌ఫ్పాండిచేస్తున్నాడు. వ‌రుస మూవీల‌తో షాక్ ఇస్తున్నాడు.

'అమ‌ర‌న్' త‌ర్వాత కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఎక్క‌డికో వెళ్లిపోయింది. వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో ఆయ‌న రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రెజెంట్ వరుస సినిమాలతో.. చాలా బిజీగా ఉన్నాడు. 'అమరన్' (Amaran) త‌ర్వాత ఈ హీరో తన 25వ సినిమా ‘పరాశక్తి’ (Parasakthi) ని లైన్ లో పెట్టాడు. ఈ చిత్రం షూటింగ్ సూపర్ ఫాస్ట్‌గా జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల (Sreeleela) గ్లామర్ జోడిస్తోంది. అయితే ఈ మూవీతో పాటు మ‌రో రెండు సినిమాల‌ను లైన్లో పెట్ట‌గా.. ఆ అప్ క‌మింగ్ ప్రాజెక్టుల గురించి ఆస‌క్తికర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.


శివ‌కార్తికేయ‌న్ త‌న నెక్స్ట్ ప్రాజెక్టును కూడా లైన్ లో పెట్టాడు. డైరెక్టర్ శిబి చక్రవర్తి (Cibi Chakravarthi) తో ‘SK-24’ చేస్తున్నాడు. ఈ సినిమాలో రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) హీరోయిన్‌గా.. ఎస్ జే సూర్య (S. J. Surya) విలన్‌గా సందడి చేయనున్నారు. ఇది కూడా స్పీడ్‌గా ప‌ట్టాలెక్కుతోంది. అయితే దీంతో పాటు మ‌రో క్రేజీ ప్రాజెక్టుల‌ను లైన్లో పెట్టాడు ఈ హీరో. దీనికి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu)తో తన నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట కార్తికేయ‌న్. ఈ సినిమాకు ‘టైమ్ ట్రావెల్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారని టాక్. ఆల్రెడీ రెండు సినిమాలు చేతిలో ఉండ‌గానే.. మ‌రో సినిమాల‌ను లైన్లో పెట్ట‌డాన్ని చూసి అంద‌రూ షాక్ అవుతున్నారు. ఇక‌పోతే వెంకట్ ప్రభు డైరెక్షన్, VFX తో ఈ మూవీ సూపర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని బజ్. షూటింగ్ నవంబర్ నుంచి స్టార్ట్ అవ్వనుందట. అంతేకాదు, త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని సమాచారం. ఇందులో హీరోయిన్ గా ఇద్దరు ముద్దుగుమ్మలను తీసుకుంటున్నారట. కాయాదు లోహర్ (Kayadu Lohar) తో పాటు కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి శివ‌కార్తికేయ‌న్ సూప‌ర్ స్పీడ్ అంద‌రినీ షాక్ గురిచేస్తోంది.

Updated Date - Jun 09 , 2025 | 07:20 PM