సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shankar New Movie: గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, అవతార్‌ తరహాలో.. శంకర్‌ ప్లాన్‌ రెడీ

ABN, Publish Date - Jul 12 , 2025 | 12:36 PM

భారీ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ దర్శకుడు శంకర్‌(Shankar). ఆయన సినిమాలు అంటే భారీతనం, బారీ బడ్జెట్‌, కళ్లు చెదిరే సెట్లు. ఒకప్పుడు హిట్‌ సినిమాలకు కేరాఫ్‌ అయిన ఆయన ప్రస్తుతం పరాజయాల్లో ఉన్నారు.

భారీ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ దర్శకుడు శంకర్‌(Shankar). ఆయన సినిమాలు అంటే భారీతనం, బారీ బడ్జెట్‌, కళ్లు చెదిరే సెట్లు. ఒకప్పుడు హిట్‌ సినిమాలకు కేరాఫ్‌ అయిన ఆయన ప్రస్తుతం పరాజయాల్లో ఉన్నారు. ఆయనకు సరైన విజయం దక్కి చాలా కాలమైంది. ఈ మధ్యకాలంలో ఆయన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు -2(Indian 2), గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) చిత్రాలు డిజాస్టర్‌ అయ్యాయి. వరుసగా రెండు పరాజయాలతో విమర్శల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన హిట్‌ సినిమా తీయడానికి కథపై కసరత్తులు చేస్తున్నారు. తన మార్క్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. భారతదేశం గర్వించే సినిమా అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు.


తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు శంకర్‌. లక్ష కాపీలు అమ్ముడైన ‘వేల్పారి’  అనే నవల గురించి ఆ వేదికపై మాట్లాడారు. దీని ఆధారంగా ఆయన తన కలల ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు చెప్పారు.. ‘‘ఒకప్పుడు నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘రోబో’. ఇప్పుడు ‘వేల్పారి’ (Velpari) భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రానుంది. ఇప్పటివరకు చేసిన అతిపెద్ద చిత్రాల్లో ఇదొకటి అవుతుంది. దీనికి భారీ స్థాయిలో  కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిజైన్స్‌, టెక్నాలజీ అవసరం ఉంది. ఈ సినిమాతో ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’, ‘అవతార్‌’ వంటి చిత్రాలకు ఉపయోగించిన సాంకేతికతను పరిచయం చేయనున్నాను. ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తుంది. త్వరలోనే నా కల నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని శంకర్‌ అన్నారు. గత చిత్రాలు రెండు ఫెయిల్‌ కావడంతో ఈ సినిమా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ హీరో యశ్‌తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ నిర్మాతలు ఈ సినిమాలో భాగస్వాములు  కానున్నారని టాక్‌.

Updated Date - Jul 12 , 2025 | 02:28 PM