సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kamal Haasan: కమల్ హాసన్‌పై.. సీరియ‌ల్‌ ఆర్టిస్ట్‌ హత్యా బెదిరింపులు!

ABN, Publish Date - Aug 11 , 2025 | 10:55 AM

నిత్యం వార్త‌ల్లో నిలిచే త‌మిళ అగ్ర హీరో, రాజ్యసభ సభ్యుడు క‌మ‌ల్ హ‌స‌న్ మ‌రోమారు హాట్ టాపిక్ అయ్యాడు.

Kamal Haasan

నిత్యం ఏదో ఓ విష‌యంలో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచే త‌మిళ అగ్ర హీరో, రాజ్యసభ సభ్యుడు, ఎంఎన్ఎం అధ్యక్షుడు క‌మ‌ల్ హ‌స‌న్ (Kamal Haasan) మ‌రోమారు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇటీవల చెన్నైలో న‌టుడు సూర్య అగ‌రం పౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో జరిగిన ఒక కార్య‌క్ర‌మంలో క‌మ‌ల్ హ‌స‌న్ మాట్లాడుతూ.. స‌నాత‌న ప‌ద్దతులు, సిద్ధాంతాల‌ను క‌ట్ట‌డి చేసే ఆయుధం విద్య అని అది అంద‌రికీ అందాల‌ని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. చాలా ప్రాంతాల నుంచి విమ‌ర్శ‌లు సైతం వ‌చ్చాయి. ఆస్తిక సంఘాల నేతలు ఇప్ప‌టికీ ఆయ‌న‌పై మండి ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ సీరియ‌ల్‌ ఆర్టిస్టు ర‌వి చంద్ర‌న్ ఆ వ్యాక్య‌త‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ క‌మ‌ల్‌ను చంపేస్తానని, త‌ల న‌రికేస్తానంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో కమల్ హాసన్‌పై హత్యా బెదిరింపులకు పాల్పడిన జూనియర్ ఆర్టిస్ట్ రవిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఎన్ఎం నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Aug 11 , 2025 | 10:55 AM