SS Devadas: సీనియర్ దర్శక నిర్మాత.. దేవదాస్ కన్నుమూత
ABN, Publish Date - Dec 02 , 2025 | 07:29 AM
హీరోయిన్ కనక తండ్రి, సీనియర్ సినీ దర్శకుడు ఎస్.ఎస్.దేవ దాస్ కన్నుమూశారు.
అలనాటి దిగ్గజ సినీ దర్శక నిర్మాత ఎస్.ఎం.ఎస్.సుందరరామన్ కుమారుడు, హీరోయిన్ కనక (Kanaka) తండ్రి, సీనియర్ సినీ దర్శకుడు ఎస్.ఎస్.దేవ దాస్ (88) (SS Devada) కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ప్రముఖ దర్శకుడు భీమ్ సింగ్ 'ప' అక్షరం టైటిల్స్ తో తెరకెక్కించిన అనేక తమిళ, హిందీ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ప్రముఖ నటి దేవిక (Devika)ను ప్రేమ వివాహం చేసుకుని ఆ తర్వాత విడిపోయారు. ఈ దంపతుల సంతానమే నటి కనక మహాలక్ష్మి అలియాస్ కనక. మొదటి భార్యతో తెగ దెంపులు చేసుకున్న తర్వాత దేవదాస్ తన కుమార్తె కనకతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు.
ఆయన 1938 ఆగస్టు 3న మదురైలో జన్మించారు. ఆయన అయ్యప్ప భక్తుడు కావడంతో గురుస్వామి ఎంఎన్ నంబియార్ ప్రేమాభిమానాలు పొందారు. క్రమం తప్పకుండా 40 యేళ్ళ పాటు శబరిమలై వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు.
'వెకులిపెణ్' అనే చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో నిర్మించి దర్శకత్వం వహించారు. మలయాళ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.