సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha: వెట్రిమార‌న్ యూనివ‌ర్స్.. శింబు స‌ర‌స‌న‌ స‌మంత‌

ABN, Publish Date - Oct 07 , 2025 | 10:30 AM

వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ హీరో శింబు హీరోగా ఓ చిత్రం తెర‌కెక్కునున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Samantha

జాతీయ అవార్డు గ్ర‌హీత వెట్రిమార‌న్ (VetriMaaran ) ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ హీరో శింబు (Simbu) హీరోగా ఓ చిత్రం తెర‌కెక్కునున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్త‌ల‌ను నిజం చేస్తూ మంగ‌ళ‌వారం మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసి ఈ సినిమాకు ఆర‌స‌న్ (Arasan) అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలిపారు.శింబు 49వ (STR 49) చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత క‌ళైపులి థాను త‌మ వీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందించ‌నున్నాడు

అయితే ఈ మూవీలో శింబు (Silambarasan TR) స‌ర‌స‌న సౌత్ సూస‌ర్ స్టార్ స‌మంత (Samantha Ruth Prabhu) క‌థానాయిక‌గా ఎంపికైన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే మూవీ టీం స‌మంత‌ను సైతం సంప్ర‌దించిన‌ట్లు, ఇంకా చ‌ర్చ‌లు న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. అయితే.. స‌మంత‌తో పాటు కీర్తి సురేశ్‌, శ్రీలీల‌ను సైతం ఈ సినిమా కోసం సంప్ర‌దిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. 2018లో వెట్రిమార‌న్ డైరెక్ష‌న్‌లో ధ‌నుష్ హీరోగా వ‌చ్చిన వ‌డ చెన్నై (Vadachennai) యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ సినిమా ఉండ‌నుంది. ఇక‌పై ఈ వెట్రిమార‌న్ సినిమాటిక్‌ యూనివ‌ర్స్ (Vetrimaraan Cinematic Universe )లో మూవీస్ రానున్నాయి. కాగా వెట్రిమార‌న్, శింబు వంటి ఇద్ద‌రు ఉద్దండుల క‌లయిక కావ‌డంతో ఈ చిత్రంపై త‌మిళ‌నాట అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. సోష‌ల్ మీడియా లో ఈ కాంబో గురించి చ‌ర్చ లేకుండా త‌మిళ ట్వీట్లు ఉండ‌డం లేదంటే ఈ సినిమా హైప్ ఎంత ఉందో అర్థం అవుతుంది.

Updated Date - Oct 07 , 2025 | 10:30 AM