Sriya Reddy: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా.. రాధారమా
ABN, Publish Date - Jul 12 , 2025 | 04:37 PM
ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఎంత ఎక్కువ చూపిస్తే అన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి. దీనికోసమే హీరోలు, హీరోయిన్లు నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూ తమ బాడీని అందంగా మార్చుకుంటూ ఉంటారు.
Sriya Reddy: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఎంత ఎక్కువ చూపిస్తే అన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి. దీనికోసమే హీరోలు, హీరోయిన్లు నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూ తమ బాడీని అందంగా మార్చుకుంటూ ఉంటారు. వయస్సు పైబడిన కూడా ఇంకా నాజూగ్గా ఉండడానికి హీరోయిన్లు చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్లే కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన వారే ఇప్పుడు రీఎంట్రీలో కూడా తమ అందచందాలతో అభిమానులను అలరిస్తున్నారు.
ఇక రీఎంట్రీ తో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్స్ లో శ్రియా రెడ్డి ఒకరు. అప్పుడప్పుడు అనే సినిమాతో శ్రియా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత అమ్మడు అడపా దడపా సినిమాల్లో కనిపించినా కూడా అంతగా విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఇక హీరో విశాల్ నటించిన పొగరు సినిమాలో లేడీ విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆ సినిమా సమయంలోనే విశాల్ అన్న విక్రమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రియ అనంతరం సినిమాలకు దూరమైంది.
పెళ్లి తర్వాత పిల్లలు, ఇల్లు బాధ్యతలు అంటూ బిజీగా మారినా శ్రియా రెడ్డి కొద్దిగా గ్యాప్ తర్వాత కోలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. ఇక ఆ సమయంలోనే అమ్మడికి గోల్డెన్ ఛాన్స్ లాగా సలార్ సినిమా అవకాశం వచ్చింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాధారమా మన్నార్ పాత్రలో ఆమె నటన సినిమాకే హైలెట్ గా మారింది. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ నటిగా మారిపోయింది. సలార్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీలో కూడా ఈ చిన్నది ఛాన్స్ పట్టేసింది. ప్రస్తుతం ఓజీ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాల ద్వారా వచ్చిన స్టార్ స్టేటస్ ను అమ్మడు కాపాడుకుంటూ వస్తుంది. సినిమాలు కాకుండా నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఇప్పటికీ అందాల ఆరబోతకు తానేమి తగ్గను అని నిరూపిస్తుంది. తాజాగా శ్రియా రెడ్డి ఒక డిజైనర్ డ్రెస్ లో కనిపించింది. ఆ డ్రెస్ పేరు క్రష్ ఫిల్ల్ షార్ట్స్. కలర్ ఫుల్ స్లీవ్స్ తో థైస్ వరకు మాత్రమే ఉండే ఈ డ్రెస్ లో శ్రియా రెడ్డి తన థైస్ అందాలను చూపిస్తూ కైపెక్కిచ్చింది. ఈ వయసులో కూడా ఆమె ఇంత స్టైలిష్ గా డ్రెస్సింగ్ చేసుకోవడంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికీ ఇంత స్టైల్ గా ఉంటూ కుర్ర హీరోయిన్లకు కూడా కంగారు పుట్టించేలా శ్రియ ఉంది.. ఎంతైనా సలార్ భామ సొగసు చూడతరమా అని కొందరు చెప్తుండగా ఇంకొందరు మాత్రం ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా రాధారమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రియా రెడ్డి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.