Manchu Manoj: ధైర్యంగా మాట్లాడినా.. లోపల తెలియని భయం ఉండేది
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:03 PM
‘ఇంతకుముందు నేను ఎక్కడికి వెళ్లినా ‘అన్నా సినిమా ఎప్పుడు తీస్తావు. కమ్‌బ్యాక్ ఎప్పుడు’ అని అందరూ అడిగేవారు. త్వరలోనే వస్తానని చెప్పేవాడిని. వాళ్లతో బయటకు ధైర్యంగా మాట్లాడినా.. లోపల తెలియని భయం ఉండేది. 1
‘ఇంతకుముందు నేను ఎక్కడికి వెళ్లినా ‘అన్నా సినిమా ఎప్పుడు తీస్తావు. కమ్‌బ్యాక్ ఎప్పుడు’ అని అందరూ అడిగేవారు. త్వరలోనే వస్తానని చెప్పేవాడిని. వాళ్లతో బయటకు ధైర్యంగా మాట్లాడినా.. లోపల తెలియని భయం ఉండేది. 12 ఏళ్ల తర్వాత సక్సెస్‌తో నా ఫోన్ మోగుతూనే ఉంది’ అని మంచు మనోజ్ (Manchu Manoj) అన్నారు. తేజ సజ్జా హీరోగా (Teja Sajja) మనోజ్ మహావీర్ లామా అనే ప్రతినాయకుడిగా నటించిన చిత్రం ‘మిరాయ్’ (mirai) . కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు రూ.27 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. మనోజ్ మాట్లాడుతూ ‘ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. 12 ఏళ్ల తర్వాత సక్సెస్‌తో నా ఫోన్ మోగుతూనే ఉంది. అభినందనలు వస్తున్నప్పటికీ నాకు ఇదంతా కలలా ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసినందుకు కార్తిక్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. నేను ఒప్పుకున్న చాలా సినిమాలు చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యాయి. ఒకటి అనుకుంటే మరోటి అయ్యేది. అలాంటి టైమ్‌లో కార్తిక్ నన్ను నమ్మడం నా అదృష్టం. మీరు నన్ను మాత్రమే నిలబెట్టలేదు.. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు’ అంటూ మనోజ్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నా పిల్లల విషయంలో ఎప్పుడూ భయం ఉండేది. నేను పెరిగినట్లు నా పిల్లల్ని పెంచగలనా అని ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడిని. ఆ భయాన్ని కార్తిక్ తీేసశారు. నిర్మాత కూడా ఎంతో ధైర్యంగా ఈ సినిమా పూర్తి చేశారు. ‘మనోజ్‌తో సినిమా వద్దు’ అని ఆయనకు ఎంతోమంది చెప్పి ఉంటారు. అవేవీ వినకుండా విశ్వప్రసాద్ ఈ సినిమా తీశారు. ‘మిరాయ్’ వీఎఫ్‌ఎక్స్ టీమ్ తెలుగు సినిమా గర్వపడేలా చేసింది. ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలి అని కోరుకున్న వారందరికీ పేరుపేరునా పాదాభివందనం చేస్తున్నా. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు.. ఇకపై వరుస సినిమాలు చేస్తూ మీ అందరినీ అలరిస్తాను’ అని అన్నారు