Paraak: ప్ర‌శాంత్ నీల్.. బావ మ‌రిది కొత్త సినిమా

ABN , Publish Date - Sep 30 , 2025 | 06:50 PM

'బఘీర' ఫేమ్ శ్రీమురళి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పరాక్'. ఈ సినిమా షూటింగ్ మంగళవారం బెంగళూర్ లో మొదలైంది.

Sriimurali Paraak Movie

'బఘీర' (Bagheera) సినిమాతో తెలుగు వారికీ పరిచయం అయిన కన్నడ స్టార్ హీరో శ్రీమురళి (Sriimurali) నటిస్తున్న తాజా చిత్రం 'పరాక్' (Paraak). ఈ సినిమా షూటింగ్ బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు హాజరై క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కు పనిచేసిన హలేష్ కోగుండి 'పరాక్‌' మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను బ్రాండ్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.


pk (4).jpeg

'పరాక్' గురించి శ్రీమురళీ మాట్లాడుతూ, 'పరాక్' ఒక వింటేజ్ స్టైల్ మూవీ. నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌ కథ ఎంచుకోవడానికి దాదాపు 200 స్క్రిప్ట్స్ విన్నాను. గత రెండేళ్ళుగా 'పరాక్' టీమ్ తో ప్రయాణిస్తున్నాను. అక్టోబర్ మాసంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాకు చరణ్‌ రాజ్ సంగీతం అందిస్తారు' అని అన్నారు. ఈ సినిమాకు సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్ కాగా ఉల్లాస్ హైదూర్ ఆర్ట్ డైరెక్టర్. ఇంచార సురేష్ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

pk (3).jpeg

Also Read: Dhanush: 'ఇడ్లీ కొట్టు' రన్ టైమ్ ఎంతంటే...

Also Read: Rukmini Vasanth: మా రుక్మిణిని.. త‌క్కువ చేసి మాట్లాడొద్దు! అభిమానుల ఆగ్రహం

Updated Date - Sep 30 , 2025 | 07:20 PM